twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రోబో' నిర్మాతకి పోలీస్ సమన్లు

    By Srikanya
    |

    రోబో నిర్మాత, మీడియా మాగ్నట్ (సన్ నెట్ వర్క్ యజమాని)గా చెప్పబడే కళానిధి మారన్ పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి సమన్లు జారి చేసారు. సన్ పిక్చర్స్ పై పెట్టిన ఛీటింగ్ కేసుతో ఆయనకు ఇలా సమన్లు జారి చెయ్యాల్సి వచ్చిందని చెన్నై లోని కేకే నగర్ పోలీసులు చెప్తున్నారు. ఇక సేలంకి చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తమను ఎనభై మూడు లక్షలకు మోసం చేసారని అభియోగంతో పోలీస్ కేసు నమోదు చేసారు. అలాగే తాను ఆ డబ్బు అడిగినందకు తనను బెదిరిస్తున్నారని కూడా అందులో ఉంది. ఇక తీర్ద విట్టు పిళ్లై అనే చిత్రం కానూ ఈ బాకీ వచ్చిందని చెప్తున్నాడు. ఇక ఇప్పటికే సన్ పిక్చర్స్ కి చెందిన హన్సరాజ్ సక్సేనా ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఆయన కందన్ ఫిల్మ్ కు చెందిన కందన్ అనే వ్యక్తి పెట్టిన కంప్లైంట్ తో అరెస్టు చెయ్యబడి ఉన్నారు. ఇక ఈ రోజు ఏదో ఒక సమయంలో కళానిధి మారన్..కెకె నగర్ పోలీస్ స్టేషన్ కి వస్తారని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే దయానిధి మారన్..2జి స్కామ్ లో పీకలోతు ఇరుక్కని ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎంతో లాభాలు ఆర్జించింది అని చెప్పుకున్న రోబో విషయంలోనూ ఎనిమిది కేసులు పెట్టబడటం విశేషం.ప్రస్తుతం సక్సెనా పదిహేను రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు.

    English summary
    Robo Producer Kalanithi Maran, managing director of the Rs.19 billion turnover Sun TV Network Ltd, has received police summons in connection with cheating cases lodged against the company's movie division Sun Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X