రోజా నిజంగా దేవత, ఆమెతో దర్శకుడికి టార్చరేనా?
హైదరాబాద్: తమిళ దర్శకుడు కళంజియం.... నటి, ఎమ్మెల్యే రోజాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆమె తన ప్రాణాలు కాపాడిన దేవత అంటూ పొగిడేస్తున్నాడు. ఇటీవల రాజమండ్రిలో ఓ మిత్రుడి పెళ్లికి హాజరై తిరిగి చెన్నైకు వెళుతుండగా తమిళ దర్శకుడు కలైంజియం ప్రకాశం జిల్లాలో ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. తీవ్రగాయాలపాలై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఆయన ఇటీవలే కోలుకున్నారు.
రోజా వల్లే తాను ఈ రోజు ప్రాణాలతో మిగిలి ఉన్నానని, ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు తనను అంతగా సౌకర్యాలు లేని ఓ ఆసుపత్రిలో చేర్పించారని... తర్వాత రోజా ఫోన్ కాల్‌తో పోలీసులు వెంటనే ఓ పెద్ద ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించారని వివరించాడు. ఈ విధంగా రోజాను దేవతగా వర్ణిస్తున్నాడు కళంజియం.

అయితే హీరోయిన్ అంజలితో విబేధాల వల్ల కళంజియం ఇప్పటికీ టార్చర్ అనుభవిస్తున్నాడని అంటున్నాడు అతని సన్నిహితులు. హీరోయిన్ అంజలి, తమిళ డైరెక్టర్ కళంజియం మధ్య గొడవ గురించి అందరికీ తెలిసిందే. అంజలి తన వద్ద అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇచ్చి షూటింగులకు రావడం లేదని కళంజియం కోర్టు వరకు వెళ్లారు.
అయితే తన పిన్నితో కలిసి కళంజియం తనను డబ్బు కోసం వేధిస్తున్నారంటూ అంజలి గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అంజలి నుండి రావాల్సిన డబ్బు రాక పోవడంతో కళంజియం మానసికంగా బాధ అనుభవిస్తున్నాడట. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బాగా సంపాదిస్తున్న అంజలి....తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని వేడుకుంటున్నాడట.


Click it and Unblock the Notifications











