యువ హీరోతో హల్లో హీరోయిన్ రొమాన్స్.. హల్లో తర్వాత
హలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా తమిళ చిత్రానికి సంబంధించిన ఆఫర్‌ను చేజిక్కించుకొన్నది. ఈ చిత్రంలో యువ హీరో శివకార్తీకేయన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో, నటుడు అర్జున్ సర్జా విలన్ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా, జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా, అంటోని ఎల్ రుబెన్ ఎడిటర్ బాధ్యతలను నిర్వహించనున్నారు.
శివకార్తీకేయ, కల్యాణి ప్రియదర్శన్ జంటగా ఈ చిత్రాన్ని 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారు.

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజి కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ అనే విషయం తెలిసిందే. తొలుత విక్రమ్ నటించిన ఇరు మురుగన్ చిత్రానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత అఖిల్‌తో హలో చిత్రంలో నటించింది.


Click it and Unblock the Notifications











