కమల్ కి కాలుతోంది

ఇక కథనంలో బాగా వీక్ అని తేల్చేసారు. అంతేగాక కమల్ బ్రహ్మణుడు గెటప్ తప్ప మరేమీ గొప్పలగా లేవంటూ రాసాయి. విలన్ ఇంట్రడక్షన్ అయ్యాక కథ, కథనాలు దారి తప్పాయని, క్లైమాక్స్ అనవసరమైన నసతో ముగించారంటూ రాశాయి. అయితే కమల్ వంటి నటుడు చేసిన గొప్ప ప్రయత్నంగా పొగిడాయి. ఇక వీటిన చూసి కమల్ మండిపడుతున్నాడు. ఇక్కడ జనాలకు నచ్చిన చిత్రం అక్కడ వారికి నచ్చకపోవటాన్ని తప్పుపడతున్నారు. దక్షిణాది చిత్రాలపై ఉన్న చిన్న చూపే ఇలాంటి కామెంట్స్ కు చోటిచ్చిందంటూ ముంబయికి చెందిన మీడియాకు ఇంటర్వూలో ఆవేశంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కమల్..వెంకటేష్ తో కలిసి ఈనాడు చిత్రంలో నటిస్తున్నాడు. ఎ వెడ్నస్ డే చిత్రానికి రీమేక్ గా ఈనాడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











