సినిమా చూసి కమల్ అభినందనలు
చెన్నై : 'సూదు కవ్వుం' సినిమా యూనిట్ ని విశ్వనటుడు కమల్‌హాసన్ అభినందించాడు. 'పిజ్జా', 'నడువల కొంజెం పక్కత్తు కానోం'తో వరుస విజయాలు అందుకుంటున్న యువ నటుడు విజయ్ సేతుపతి తాజాచిత్రం 'సూదుకవ్వుం'. కిడ్నాప్ నేపథ్యంలో సాగుతుంది. ఇటీవల విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
సినిమా తిలకించిన కమల్‌హాసన్ చక్కటి కథ ఎంచుకున్నారంటూ ప్రశంసించారు. దర్శకుడు నలన్ కుమారస్వామి, చిత్ర నటీనటులను తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారట. అనివార్య కారణాలతో కార్యాలయానికి రాలేకపోయిన విజయ్‌సేతుపతిని కూడా ఫోన్ ద్వారా ప్రశంసించారు.

మరోప్రక్క హిందీలో మంచి విజయం సాధించిన 'స్పెషల్ ఛబ్బీస్' చిత్రం తెలుగు,తమిళ రీమేక్ కు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ తమిళ దర్సకుడు లింగు స్వామి రైట్స్ తీసుకున్నారు. తమ బ్యానర్ తిరపతి బ్రదర్శ్ పై ఈ చిత్రం రైట్స్ తీసుకున్న లింగు స్వామి,తానే డైరక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. హీరోయిన్,మిగతా పాత్రలు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
అక్షయ్ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. 'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చారు. '1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.
మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.


Click it and Unblock the Notifications











