twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లీడర్ భామకు కమల్ అవమానం

    By Srikanya
    |

    ప్రియా ఆనంద్ కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో డైరక్ట్ కమల్ హాసన్ ని మీడియావారు చెన్నైలోని ఓ ఈవెంట్ లో కలిసి ఈ సంగతి ప్రస్దావించాడు. దానికి కమల్ స్పందింస్తూ.. ఇంతకూ ప్రియా ఆనంద్ ఎవరూ అని రిప్లై ఇచ్చారు. అంతేగాక ఇప్పటివరకూ హీరోయిన్ సెలక్షన్ పూర్తికాలేదని చెప్పుకొచ్చారు. అలాగే తన దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తానని చెప్పుకొచ్చారు.

    ఇక ఈ చిత్రంలో కమల్... నెగిటివ్ రోల్ లో కనిపించి మురిపించనున్నాడు. విశ్వరూపం టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో ఆయన విలనిజం కనిపించే పాత్రను పోషిస్తున్నారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక కమల్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో దాదాపు వంద కోట్ల వరకూ వ్యయంతో చేయనున్నారని చెప్తున్నారు. గతంలో ఇలాంటి నెగిటివ్ పాత్రలు చేసినా కమల్ ఈ మధ్య కాలంలో అలాంటి పాత్రలు పోషించలేదు. ఇక ఈ చిత్రం లొకేషన్స్ కోసం కమల్ రీసెంట్ గా కెనడా, అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు వెళ్ళి వచ్చారు

    ఇక ప్రియా ఆనంద్ తెలుగులో లీడర్ చిత్రంతో పరిచయమైంది.ఆ తర్వాత ఆమె రామ రామ కృష్ణ కృష్ణ, 180 చిత్రాల్లో చేసింది. ఆమెకు బాగా చేస్తుందని పేరు వచ్చినా ఏ సినిమా కూడా పెద్ద హిట్టు కాకపోవటంతో ఇప్పటికీ అవకాశాలు కోసం వెతుక్కునే సిట్యువేషన్ లోనే ఉంది.

    English summary
    That Priya Anand was selected for Kamal Hassan's Viswaroopam came in media.But Kamal Hassan denies the report. When asked at a event in Chennai, Kamal simply shot back: "Who is Priya Anand?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X