మాఫియా భయంతో కమల్ హాసన్

By Srikanya

చూస్తుంటే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలోకి అండర్ వరల్డ్ మాఫియా వచ్చే ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోందని కమల్ హాసన్ అన్నారు. బ్యాంకులు, పేరొందిన ఫైనాన్స్ సంస్ధలు ఏవీ సిని పరిశ్రమలో పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపటం లేదని,ఈ పరిస్దితి ఎక్కడికి దారితీస్తుందో అని భయంగా ఉందని ఆయన భయం వ్యక్తం చేసారు. ఇక లీగల్ గా,ఇల్లీగర్ గా పెట్టుబడులు సినీ పరిశ్రమలోకి వస్తున్నాయి. చివరకు పౌల్ట్డీ పరిశ్రమ పెట్టుకునే వారికి సైతం లోన్స్ లభిస్తున్నాయి కానీ, సినిమా వారికి ఫైనాన్స్ అంటే బ్యాంక్ లకు ఆసక్తి లేదని ఆవేదనతో అన్నారు. ఈ విషయమై తాము ఎబ్రాసింగ్ ది డిజిటల్ వరల్డ్ అని చెన్నై లో రెండు రోజులు పాటు జరిగే సమావేశంలో చర్చించనున్నామని అన్నారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం చేస్తున్నారు.

కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న చిత్రం విశ్వరూపం. కమల్ తానే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో హాహల్ బోస్ ని విలన్ గా ఎంపిక చేసారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా ఎంపిక చేసిన ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరగనుంది. అలాగే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారు. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కమల్ రెడీ అవుతున్నారు. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇక ప్రజ్టేజియస్ ప్రాజెక్టులో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఎంపిక చేయటానికి కమల్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X