వచ్చే నెలలో కమల్ హాసన్ కొత్త సినిమా రిలీజ్

By Srikanya

కమల్ హాసన్ కొత్త చిత్రం వచ్చే నెలలో రిలీజవబోతోంది. అయితే విశ్వరూపం చిత్రమా ..ఇంకా షూటింగే మొదలు కాలేదు కదా అప్పుడే రిలీజ్ అవటమేంటి అని కంగారుపడొద్దు. ఆయన మలయాళంలో చేసిన '4 ఫ్రెండ్స్"చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. షాజీసురేంద్ర దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం '4 ఫ్రెండ్స్". ఆర్.ఎ.ప్రొడక్షన్స్ పతాకంపై జాని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథ ఏమిటంటే...నలుగురు ప్రాణమిత్రుల మధ్య అనూహ్యంగా ఏర్పడే స్పర్థలు వారి జీవితాల్లో ఎలాంటి మార్పులను తెచ్చాయి. వారి జీవితాలను కమల్ ఎలా చక్కదిద్దారు అనేది ఈ కథ సారాంశం.

స్నేహం నేపథ్యంలో సాగే ఈ సినిమా మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తప్పకుండా తెలుగువారికి కూడా నచ్చుతుందని మా నమ్మకం అంటున్నారు నిర్మాతలు. ఇక వచ్చేనెల మొదటి వారంలో పాటలను, మూడోవారంలో సినిమాను విడుదల చేయనున్నాం అని చెప్పారు. ఈ చిత్రం 2007లో వచ్చిన బకెట్ లిస్ట్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా రూపొందింది. కమల్ ఇందులో గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. మీరాజాస్మిన్, జయరామ్, జయసూర్య, సమీర్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.జయచంద్రన్, కెమెరా: అనీల్ నాయర్, నిర్వహణ: జి.శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X