ప్రతీ ఆర్టిస్ట్‌కు అభిమానులపై ఆ అనుమానం ఉంటుంది.. కమల్‌ను మెప్పించిన నటుడు

ప్రతీ ఆర్టిస్ట్‌కు తాను అభిమానించే మరో ఆర్టిస్ట్ ఉంటారు. మన దగ్గర చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని హీరోలు అయిన వారెంతో మంది ఉంటారు. అయితే తెరపై హీరోల మ్యానరిజం, డ్యాన్స్ మూమెంట్స్, డైలాగ్ డెలివరి ఇలా ప్రతీ ఒక్కదాన్ని అవపోసన బడతారు అభిమానులు. తమ హీరో ఎలా చేస్తే అలాగే అనుకరించడానికి ప్రయత్నిస్తారు. తాజాగా కమల్ హాసన్‌ను పోలి ఉన్న ఓ నటుడు చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌కు లోకనాయకుడు ఫిదా అయిపోయాడు.

మామూలుగా లెజెండ్ హీరోలను ఎంతో మంది అనుకరిస్తుంటారు. వారు మాట్లాడే విధానం, కాలు కదిపే తీరు ఇలా ప్రతీ ఒక్కటి అభిమానులు ఎంతో తీక్షణంగా గమనిస్తుంటారు. తెలుగులో సింగర్ మల్లికార్జున్ చిరంజీవిలా డ్యాన్స్ వేస్తుంటాడు. అచ్చంలా చిరు మెలికలు తిరుగుతూ స్టెప్పులు వేస్తుంటాడు. తమిళ హీరో శివ కార్తికేయన్.. రజినీకాంత్ మ్యానరిజాన్ని అచ్చుగుద్దినట్టు ప్రదర్శిస్తాడు. స్వతహాగా మిమిక్రి ఆర్టిస్ట్ కావడంతో అది ఇంకా సాధ్యపడింది. అయితే తాజాగా ఓ మళయాలి నటుడు కమల్ హాసన్ హృదయాన్ని గెలిచాడు.

Kamal haasan About Ashwin KUmar Annatha aadurar video

అపూర్వ సహోదరులు సినిమాల్లోని పాటకు కమల్ వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టుదించేశాడు. చూడటానికి అచ్చం కమల్ హాసన్‌లా ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంది. ట్రేడ్‌మిల్‌పై చేసిన డ్యాన్స్‌పై కమల్ హాసన్ స్పందిస్తూ.. 'ఆర్టిస్ట్‌లందరికీ ఓ అనుమానం ఉంటుంది.. మేము చేసే ప్రతీ ఒక్క మూమెంట్స్ ఫ్యాన్స్ గమనిస్తారా? లేదా అని. ఇతను మాత్రం నా ప్రతీ చిన్ని హావభావాన్ని దించేశాడు. ఆయన్ను కన్న తండ్రి ఎంత గొప్పోడో. దీర్ఘాయుష్మాన్ భవ.. నా పని తనం తరతరాలను ఉత్తేజింపచేస్తున్నందుకు ఆనందంగా ఉంద'ని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X