twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లాక్‌మనీ తీసుకొంటే నా సంపాదన ఆ రేంజ్‌లో.. తొలి రెమ్యునరేషన్ అంతే.. కమల్ హాసన్ ఎమోషనల్

    |

    సమ కాలీన పరిస్థితులు, వాటి గురించి ప్రముఖుల ఆలోచనలు, అభిప్రాయాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఇండియా టుడే దక్షిణాది సదస్సులో విలక్షణ నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ సదస్సు 2వ రోజున కమల్ హాసన్ తన కెరీర్, రాజకీయ ప్రస్థానం గురించి ఎమోషనల్‌గా పలు విషయాలను వెల్లడించారు. ఇండియా టుడే సదస్సులో కమల్ హాసన్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    తమిళనాడులో రాజకీయ చైతన్యం

    తమిళనాడులో రాజకీయ చైతన్యం

    తమిళనాడులో ఏళ్ల తరబడి రెండు పార్టీల మధ్య సాగుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలను తుద ముట్టించడం కోసమే తాను పార్టీ పెట్టాను. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల విపరీత ధోరణులన ప్రజలకు వివరిస్తాను. రాజకీయాల్లోను, ప్రజల్లోనూ చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యం అని కమల్ హాసన్ అన్నారు.

    నల్లడబ్బు తీసుకొంటే నా రెమ్యునరేషన్

    నల్లడబ్బు తీసుకొంటే నా రెమ్యునరేషన్

    కమల్ హాసన్ తాను అందుకొన్న రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. నా పారితోషికం అనూహ్యంగా పెరగకపోవడానికి కారణం ఉంది. నేను నల్ల డబ్బు రూపంలో రెమ్యునరేషన్ తీసుకొంటే రెండు, మూడింతలు పెరిగిపోయేది. కానీ నేను అడ్డదారులు తొక్కి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ప్రతీ ఏడాది పన్నులు చెల్లిస్తాను. నాకు ఈడీ, సీబీఐ లాంటి దాడుల గురించి భయం లేదు అని కమల్ హాసన్ తెలిపారు.

    నా తొలి పారితోషికం ఎంతంటే

    నా తొలి పారితోషికం ఎంతంటే

    నా యవ్వనంలోనే కెరీర్ ప్రారంభించాను. నా తొలి రెమ్యునరేషన్ క్యాష్ రూపంలో అందుకొన్నాను. నా తొలి సంపాదన అప్పట్లో రూ.4 వేలు. అంత మొత్తం పారితోషికంగా అందుకోవడం గర్వంగా అనిపించింది. ఆ తర్వాత నా పారితోషికం ఆరు అంకెలు అంటే లక్షల్లో చేరుకొన్నది. అప్పటి నుంచి నేను ట్యాక్స్ చెల్లించడం ప్రారంభించాను అని కమల్ హాసన్ వెల్లడించారు.

    ఒకవేళ రాజకీయాల్లో ఓడిపోతే

    ఒకవేళ రాజకీయాల్లో ఓడిపోతే

    తన రాజకీయ ప్రవేశంపై కమల్ హాసన్ స్పందిస్తూ.. యాక్టింగ్‌లో నా లెగసికి పాలిటిక్స్‌కు సంబంధం లేదు. ఒకవేళ నేను ఓడిపోతే నా స్టార్ స్టేటస్‌కు భంగం కలుగువచ్చేమో.. కానీ నటుడిగా నాకు ఢోకాలేదు. నేను లేకపోయినా నా సినిమాలు, నటన గురించి అభిమానులు గుర్తు చేసుకొంటారు అని కమల్ హాసన్ తెలిపారు.

    ప్రజాసేవ కోసమే శేష జీవితం

    ప్రజాసేవ కోసమే శేష జీవితం

    నటుడిగా నేను పరిపూర్ణతను సాధించాను. ఒక మిగిలిన జీవితంలో నా సేవలను ప్రజలకు అకింతం చేయాలని నిర్ణయం తీసుకొన్నాను. ఎంత వరకు సాధ్యమైతే అంత వరకు నేను ప్రజా సంక్షేమం కోసమే పాటుపాడాలనుకొంటున్నాను. రానున్న కాలమే నా జీవన ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది అని కమల్ హాసన్ అన్నారు.

    English summary
    Indian versatile actror Kamal Haasan participated in India Today Conclave South. He talks about his remuneration in the film industry and black money in kollywood. Kamal shared his ideology about his politics at India Today Conclave South
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X