విశ్వరూపం2 తర్వాత.. శేఖర్ కపూర్ దర్శకత్వంలో కమల్ హాసన్..

By Rajababu

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం2 చిత్ర ట్రైలర్ అట్టహాసంగా ఆవిష్కరించారు. హిందీలో అమీర్ ఖాన్, తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో శృతిహాసన్ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్, కమల్ హాసన్‌కు మధ్య ఆసక్తికరమైన సంభాషణ ట్విట్టర్‌‌లో జరిగింది.

Kamal Haasan to act in Shekhar Kapoors next

విశ్వరూపం విడుదల కానున్న నేపథ్యంలో కమల్ హాసన్‌కు ఆల్ ది బెస్ట్. నటుడిగా నాకు ఏ మాత్ర అనుభవం లేకపోయినా.. నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చి ఈ చిత్రంలో భాగస్వామ్యం చేశావు. విశ్వరూపం2 సెట్స్‌లో నీ నుంచి నేను చాలా చేర్చుకొన్నాను. నా తదుపరి చిత్రంలో నీవు నటించాలి. నేను డైరెక్ట్ చేస్తాను అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు.

శేఖర్ కపూర్ చేసిన ట్వీట్‌కు కమల్ స్పందిస్తూ.. థ్యాంక్స్ శేఖర్ కపూర్. నీ దర్శకత్వంలో నటించాలని 35 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. మనం త్వరపడాలి. ఓ పొలిటికల్ నేపథ్యం ఉన్న చిత్రంలో నటించాలని ఉంది. లేకపోతే ఇక నేను నటించడం కష్టం అని కమల్ ట్వీట్‌లో అన్నారు.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న విశ్వరూపం చిత్రం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్రంలో మేజర్ విసమ్ ఆహ్మద్ కశ్మీరి అనే పాత్రలో కమల్ నటిస్తున్నారు. శేఖర్ కపూర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X