Kamal Haasan హాస్పిటల్‌లో చేరిన కమల్.. అసలేం జరిగిందంటే?
దేశం గర్వించదగిన నటుడు, మక్కల్ నీది మాయిమ్ అధినేత కమల్ హాసన్ గత వారం రోజులుగా బిజీ బిజీగా, చురుకుగా పలు కార్యక్రమాల్లో కనిపించారు. తమిళ బిగ్‌బాస్ ఫినాలే కోసం శుక్ర, శని ఆదివారాల్లో కమల్ హాసన్ షూటింగులో పాల్గొన్నారు. అలాగే పుష్ప తమిళ సినిమాను చూసి అల్లు అర్జున్ ఫెర్పార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా శివకార్తీకేయన్‌తో తమిళ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ తమిళ్ 5 సీజన్ ముగియగానే మరో షోతో సిద్దమవుతున్నారు. బిగ్‌బాస్ అల్టీమేట్ ఓటీటీ షో ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ షో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఇలా బిజీగా ఉన్న కమల్ హాసన్ హాస్పిటల్‌లో చేరడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే ఫ్యాన్స్ ఆందోళనను తగ్గించేందుకు కమల్ పీఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చారు.
కమల్ హాసన్ హాస్పిటల్‌లో చేరిన విషయం వాస్తవమే. కానీ ఎలాంటి అనారోగ్య సమస్యతో చేరలేదు. రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగానే కమల్ చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్‌లో చేరారు. సాయంత్రం లోపు అన్ని పరీక్షలు జరిగితే ఆయన వెంటనే డిశ్చార్జి అవుతారు అని ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉండగా, కమల్ హాసన్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అలాగే మహేష్ నారాయణ్, వెట్రీమారన్, పా రంజిత్ దర్శకులతోపాటు ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











