కమల్ హాసన్ సంచలన రాజకీయ ప్రకటన.. రజనీకాంత్‌తో కలిసి అంటూ..
ప్రముఖ నటుడు, దక్షిణాది సూపర్ స్టార్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. కమల్ ప్రకటనతో ఇప్పటికే వేడెక్కిన తమిళ రాజకీయాలు మరింత హాట్‌గా మారాయి. ఇప్పటికే రాజకీయ బరిలోకి దూకిన కమల్ రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. సోమవారం కమల్ చేసిన ప్రకటనకు సంబంధించిన వివరాలు..

కరుణానిధి, జయలలిత లేకుండానే
తమిళనాడులో వచ్చే ఏడాది అంటే మే 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సారి తమిళ రాజకీయాల్లో దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత లేకుండానే బరిలోకి అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు బరిలోకి దూకనున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ ఏ మేరకు ప్రభావం చూపుతారనే విషయం ఆసక్తిగా మారింది.

2021లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ
2018లో కమల్ హాసన్ మక్కల్ నీది మైయం పార్టీని ప్రారంభించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే మే 2021లో జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ పోటీ చేయనున్నట్టు కమల్ ఓ ప్రకటన చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడంపై ఓటర్లకు సంకేతాలు పంపించారు.

ఎక్కడి నుంచి పోటీ చేస్తానంటే..
ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకొన్నారు. తాను ఏ స్థానం నుంచి పోటీ చేయనున్నదనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్టు తాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. రజనీ రాజకీయ ప్రవేశంపై తాను వ్యాఖ్యానించుకోదలుచుకోలేదు అంటూ కమల్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Recommended Video

పొలిటికల్ థ్రిల్లర్‌గా 232 చిత్రం
ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై స్వాగతించారు. త్వరలోనే తామిద్దరి కలిసి ఓ చిత్రంలో నటించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల తన పట్టిన రోజును పురస్కరించుకొని తన కెరీర్‌లో 232 చిత్రంగా రానున్న మూవీకి సంబంధించిన టీజర్‌ను అందించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











