For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిర్యానీ బ్యాన్ చేయండి అంటూ కమల్ హాసన్ సంచలన వ్యాఖ్య

  By Srikanya
  |

  చెన్నై: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది కూడా జల్లికట్టును దూరం చేసే ప్రయత్నాల్లో పడడం తమిళనాట ఆగ్రహాన్ని రేపిం ది. జల్లికట్టు ప్రేమికులు పోరుబాట సాగిస్తూ వస్తున్నారు. ప్రతి పక్షాలన్నీ గళాన్ని వినిపిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కమల్ మీడియాతో మాట్లాడారు.

  సాంప్రదాయ క్రీడ జల్లికట్టు అంటే తనకెంతో అభిమానమని కమల్‌ హాసన్‌ చెప్పారు. జల్లికట్టుకు తాను 'బిగ్‌ ఫ్యాన్‌' అని వెల్లడించారు. జల్లికట్టును నిషేధించాలనడం సబబు కాదని 'ఇండియాటుడే' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విదేశాల్లో జరిగే బుల్‌ ఫైట్‌ కు జల్లికట్టుకు ఎంతో తేడా ఉందని వివరించారు.

  'జల్లికట్టును నిషేధించాలనుకుంటే బిర్యానీని కూడా బ్యాన్‌ చేయాలి. స్పెయిన్ లో జరిగే బుల్‌ ఫైట్స్ లో ఎద్దులను హింసిస్తారు. ఒక్కోసారి ఎద్దులు చనిపోతాయి. కానీ జల్లికట్టు అలాంటి క్రీడ కాదు. మూగజీవులకు ఎటువంటి హాని తలపెట్టరు. తమిళనాడులో ఎద్దులను దేవుడిలా పూజిస్తార'ని కమల్‌ హాసన్‌ చెప్పారు.

  Kamal Haasan backs Jallikattu, asks for ban on ‘biryani’ to save animals

  సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టును పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టుపై విధించిన నిషేధం సుప్రీంకోర్టు విధించిన నిషేధం తొలగించాలని తమిళవాసులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుపుతున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

  మరో ప్రక్క జల్లికట్టు క్రీడకు మద్దతుగా తమిళ హీరో శింబు వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. అదేమిటో ఆయన మాటల్లోనే చూద్దాం. జల్లికట్టు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం. కొందరు వ్యక్తులు, స్వార్థంతో కూడిన కొన్ని సంఘాలు తప్పుడు సమాచారంతో ఈ క్రీడను జరగకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం, న్యాయస్థానం రగులుతున్న పలు సమస్యలపై దృష్టి సారించకుండా జల్లికట్టును నిషేధించడం ప్రధాన బాధ్యతగా తలచడం ఎందుకో అర్థం కావడంలేదు.

  జల్లికట్లు క్రీడ అన్నది తమిళుల వీరత్వానికి నిదర్శనం. అంతే కాదు మన ఎద్దుల జాతి హరించకుండా కాపాడే విధానం. అలాంటి జల్లికట్టు క్రీడను కోర్టు తీర్పు కారణంగా రెండేళ్లుగా నిర్వహిచంలేని పరిస్థితి. ఒక దేశ పౌరుడిగా ప్రతి తమిళుడు న్యాయస్థానాలను గౌరవిస్తున్నారు.

  అయితే అది తమిళ సంస్కృతిని మీరేదిగా ఉండదు, ఉండరాదు కూడా. మన సంస్కృతికి తూట్లు పొడిచే ఎలాంటి చట్టం అయినా మన ఆత్మాభిమానాన్ని బాధిస్తుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరుగుతారని నమ్ముతున్నాను. ఈ దేశ పౌరుడిగా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలసిన బాధ్యత ఉన్న వాడిగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. తమిళనాడులో పొంగల్‌ సందర్భంగా జల్లికట్టును నిర్వహించాలని పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నారు.

  ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెతక వైఖరిని చూపకుండా జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి తీవ్ర చర్యలు తీసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు మళ్లీ పరిరక్షింపబడతాయని నమ్ముతునాను. జల్లికట్టును నిర్వహించేవరకూ విశ్రమించకూడదు. ఇది మన సంస్కృతి, సంప్రదాయం. మన పారంపర్యాన్ని ఎవరి కోసం విడనాడేదిలేదు. శింబు వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.

  English summary
  Kamal Haasan said that he is a big fan of the sport and all those who hate the bull sport should give up on biryani too. During his talk at the Conclave, Hasaan said, “If you want a ban on jallikattu, let’s also ban biryani”.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X