10 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబినేషన్.. రజనీ, కమల్ కలిసి సెన్సేషనల్ ప్రాజెక్ట్

సూపర్‌స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కలిసి నటించిన చిత్రాలు వెండితెరపై మ్యాజిక్ చేశాయి. చాలా కాలంగా వారిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. కొద్దికాలంగా కమల్, రజనీ కలిసి నటిస్తున్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తకు అధికారికంగా ఓ ప్రకటన రానున్నది. కమల్, రజనీ కాంత్ చేసే సంయుక్త ప్రకటన ఎప్పుడంటే..

రాజ్ కమల్ మూవీ బ్యానర్‌పై

రాజ్ కమల్ మూవీ బ్యానర్‌పై

అయితే రజనీకాంత్, కమల్ తెరకెక్కించే సినిమాలో వారిద్దరూ కలిసి నటించడం లేదట. కానీ రజనీ హీరోగా నటించే సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం కమల్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్‌పై రూపొందనున్నది. ఈ సినిమాలో నటించే వారి ఎంపిక కార్యక్రమం జోరందుకొన్నట్టు తెలుస్తున్నది.

మార్చి 5వ తేదీన ప్రకటన

మార్చి 5వ తేదీన ప్రకటన

కమల్ నిర్మించే సినిమాలో రజనీకాంత్ నటించనున్నారనే వార్త మీడియాలోనే కాదు ఇద్దరు హీరోల అభిమానుల్లో కూడా జోష్‌ను నింపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన మార్చి 5వ తేదీన రజనీ, కమల్ కలిసి ప్రకటించనున్నట్టు తమిళ మీడియా కోడైకూస్తున్నది.

16 సినిమాల్లో కలిసి నటించిన సూపర్‌స్టార్లు

16 సినిమాల్లో కలిసి నటించిన సూపర్‌స్టార్లు

ఇప్పటి వరకు కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించిన సినిమాలు సుమారు 16కు పైగానే ఉంటాయి. ఆ తర్వాత వారిద్దరూ సోలో హీరోలుగా మారి బ్లాక్‌బస్టర్లు అందుకొన్నారు. అయితే గతంలో కమల్ సూచన మేరకే రజనీకాంత్ మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉన్నట్టు సమాచారం.

Recommended Video

#Indian2 Sets Video : Kamal Haasan's 'Bharateeyudu 2' Sets Crane Mishap | Filmibeat Telugu
కమల్, రజనీ చివరి చిత్రం..

కమల్, రజనీ చివరి చిత్రం..


కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు కలిసి హిందీలో గిరఫ్తార్ అనే చిత్రం నటించారు. ఈ చిత్రంలో అమితాబ్‌తో కలిసి వీరిద్దరు నటించగా.. బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు. చివరకు ఇప్పుడు నిర్మాతగా కమల్, హీరోగా రజనీ కలిసి ప్రాజెక్టుకు అంకురార్ఫణ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X