Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
ఆగిపోయిన రూ.200కోట్ల బడ్జెట్ మూవీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్!
కమలహాసన్ శంకర్ కలయికలో వచ్చిన ఇండియన్ సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్ళీ 20 ఏళ్ళ అనంతరం ఆ సినిమాకు దర్శకుడు రూపొందించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇండియన్ 2 సినిమా ఎంతో గ్రాండ్ గా మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా బడ్జెట్ విషయంలో మొదటి నుంచి కూడా నిర్మాతలు శంకర్ కు చాలా గొడవలు జరిగాయి.
ఆ తర్వాత హఠాత్తుగా షూటింగ్ లోనే పెద్ద ప్రమాదం జరగడం కొంతమంది టెక్నీషియన్స్ కూడా మరణించడం అందరినీ చేదు అనుభవానికి గురిచేసింది. సినిమా బడ్జెట్ అతిగా పెరిగిపోవడం వలన లైకా ప్రొడక్షన్ హౌస్ ఆ సినిమా షూటింగ్ ను హోల్డ్ లో పెట్టినట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. అంతేకాకుండా దర్శకుడికి పారితోషకం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వక పోవడం వలన కూడా సమస్యలు తలెత్తినట్లు టాక్ వచ్చింది.

ఇక ప్రాజెక్ట్ ఆగిపోవడం వలన కమల్ హాసన్ దర్శకుడికి నిర్మాతలకు మధ్య సంధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇండియన్ 2 సినిమా మళ్లీ రీస్టార్ట్ కావడం అనుమానమే అని కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక విక్రమ్ సినిమా ప్రమోషన్ లో కమల్ హాసన్ ఒక క్లారిటీ ఇచ్చాడు.
తప్పకుండా సినిమా మొదలవుతుంది అని ప్రస్తుతం నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతూ ఆ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని కూడా కమలహాసన్ వివరణ ఇచ్చాడు. దీంతో కమల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు మరొకవైపు కమలహాసన్ విక్రమ్ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక శంకర్ రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి వీరి బిజీ షెడ్యూల్లో ఇండియన్ 2 సినిమాను ఎప్పుడు రీస్టార్ట్ చేస్తాడో చూడాలి.