పాటలు పాడుతూ బిచ్చమెత్తుకోవడం కాదు.. త్యాగరాజ స్వామిపై కమల్ హాసన్ సంచలన కామెంట్స్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత ముక్కుసూటిగా మాట్లాడతాడో, ప్రత్యర్థులపై మాటల తూటాలు ఎలా పేల్చుతాడో తెలిసిందే. రాజకీయాల్లోకి దిగాక కమల్ హాసన్.. మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ చర్యలపై విమర్శల బాణాలను సంధిస్తూ ఉంటాడు. నిత్యం ఏదో ఒక రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. కమల్ హాసన్‌కు ఉన్న ఈ దూకుడు తనమే తాజాగా వార్తల్లో నిలిచింది. ఓ లైవ్ షోలో పాల్గొన్న కమల్ హాసన్.. త్యాగరాజ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీటిపై ప్రస్తుతం తమిళనాట పెద్ద రచ్చ జరుగుతోంది.

కమల్ అనుచిత వ్యాఖ్యలు..
సంగీత త్రిమూర్తులలో ఒకరిగా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజస్వామిని ఉద్దేశించి సినీ నటుడు, మక్కల్ నీదీ మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తి బతికేవాడు అంటూ త్యాగరాజును ఉద్దేశించి కమల్ వ్యాఖ్యానించాడు.

బిచ్చమెత్తుకోవడం కాదు..
విజయ్ సేతుపతి లైవ్‌లో మాట్లాడుతూ.. ‘సినిమా అంటే ఛారిటీ కాదని... టికెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారమని చెప్పారు. త్యాగరాజ స్వామిలా రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
త్యాగరాజ స్వామిపై కమల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కమల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంగీతకారుడు పాల్ ఘాట్ రామ్ ప్రసాద్ ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు మద్దతుగా ఇప్పటి వరకు 16 వేల మందికి పైగా సంతకాలు చేయడం గమనార్హం.
Recommended Video

ఇండియన్ 2తో బిజీగా..
కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ సెట్‌లో క్రేన్ తెగి పడటం పలువురు మృతి చెండడం అప్పట్లో సంచలనంగా మారింది. అలా షూటింగ్ వాయిదా పడగా.. కరోనా వైరస్ వల్ల మళ్లీ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. లాక్ డౌన్ ఎత్తివేశాక తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











