కమల్ హసన్ తప్పుకోవటం లేదు, సిద్దంగానే ఉన్నాడు
ఇటీవల ‘ కమల్‌హాసన్ ‘ఇండియన్2’ నుంచి బయటకు వచ్చేశారట... చేయరట’ అనే వార్తలని "ఇండియన్ 2" టీమ్ ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది.
21 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు, తమిళనాట బ్లాక్ బస్టర్ చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన చిత్రం భారతీయుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. సమాజంలో లంచానికి వ్యతిరేకంగా పోరాడే ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథతో రూపొందిన భారతీయుడు చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ భారతీయుడుగా సినీ ప్రేక్షకులను తన నటనతో మెప్పించారు. ఇప్పుడు కమల్ హాసన్, శంకర్‌ల హిట్ కాంబినేషన్‌లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 భారీ బడ్జెట్ సినిమాను దిల్‌రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు.

ప్రస్తుతం సీక్వెల్స్ పరంపర సాగుతున్న నేపథ్యంలో 'ఇండియన్'కు సీక్వెల్‌గా నిర్మాత దిల్‌రాజు 'ఇండియన్ 2'ను నిర్మించడానికి ముందుకొచ్చాడు. అయితే.. ఇటీవల ' కమల్‌హాసన్ 'ఇండియన్2' నుంచి బయటకు వచ్చేశారట... చేయరట' అనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి.
'ఇండియన్ 2' బృందం ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ''ఎవరో వండి వడ్డించిన రూమర్ ఇది. ఈ సీక్వెల్ చేయడానికి కమల్‌హాసన్ వెనకాడట్లేదు. పైగా బరువు తగ్గుతున్నారు. తమిళ బిగ్‌బాస్ ఫైనల్ స్టేజ్ మీద ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయడానికి ముందు నుంచే ఆయన డైటింగ్ మొదలుపెట్టారు. అమెరికాకు చెందిన ట్రైనర్ ఆధ్వర్యంలో ఈ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ చేయరేమో అనే అనుమానాలు ఎవరికీ అవసరం లేదు'' అని బృందం అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications











