Bigg Boss షోకి కమల్ హాసన్ గుడ్‌బై.. హోస్ట్‌గా యువ హీరో!

దక్షిణాదిలో ఎవరూ ఊహించని విధంగా బిగ్‌బాస్ రియాలిటీ షోకు అత్యంత క్రేజ్ లభించింది. గత నాలుగు సీజన్లకు ప్రేక్షకాదరణ అనూహ్యంగా కనిపించింది. అయితే దక్షిణాదిలో సంచలన రీతిలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బిగ్‌బాస్ షోకు గట్టి దెబ్బ తగిలి అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విలక్షణ నటుడు తప్పుకొంటున్నట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Filmibeat Telugu
బుల్లితెరపై కమల్ మ్యాజిక్

బుల్లితెరపై కమల్ మ్యాజిక్

గత నాలుగు సీజన్లకు హోస్ట్‌గా కమల్ హాసన్ తన యాటిట్యూడ్, సమయస్పూర్తితో అదరగొట్టాడనే టాక్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. శని, ఆదివారాల్లో వచ్చే కమల్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేసేవారు. బుల్లితెర మీద తన హావభావాలు, సినిమాపై ఉన్న నాలెడ్జ్‌ను కంటెస్టెంట్లు, ప్రేక్షకులతో పంచుకొనే వారు. దాంతో ఆయన హోస్టింగ్‌పై ఆదరణ అనూహ్యంగా పెరిగింది.

6వ సీజన్‌కు హోస్ట్‌గా ఉండలేను

6వ సీజన్‌కు హోస్ట్‌గా ఉండలేను

అయితే బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యహరించే సమయంలో ఎండమాల్ షైన్ ఇండియాలో జరిగిన ఒప్పందం ప్రకారం 5 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు అంగీకరించారు. త్వరలోనే 5వ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్నది. దాంతో 6వ సీజన్‌కు తాను హోస్ట్‌గా ఉండలేను అని నిర్వాహకులకు చెప్పినట్టు సమాచారం.

సినిమాలు, పార్టీపై కమల్ దృష్టి

సినిమాలు, పార్టీపై కమల్ దృష్టి

బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా చేయడం వల్ల తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ కార్యక్రమాలకు సమయం చాలడం లేదు. సినిమా షూటింగులపై దృష్టి పెట్టాల్సి ఉంది. అంతేకాకుండా రాజకీయ పార్టీని బలోపేతం చేయడానికి సమయం కేటాయించాలని అనుకొంటున్నాను. కావున బిగ్‌బాస్‌కు సమయం కేటాయించలేను అని తన అభిప్రాయాన్ని నిర్వాహకులతో పంచుకొన్నట్టు తెలిసింది.

బిగ్‌బాస్ తమిళ్ 6కు హోస్ట్‌గా శింబు

బిగ్‌బాస్ తమిళ్ 6కు హోస్ట్‌గా శింబు

కమల్ అభిప్రాయాన్ని గౌరవించిన బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రస్తుతం హోస్ట్ వేటలో ఉన్నారని తెలిసింది. అయితే అంతర్గత సమాచారం ప్రకారం బిగ్‌బాస్ తమిళం 6వ సీజన్ కోసం యువ హీరో శింబును హోస్ట్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. అధికారికంగా ఎండెమాల్ షైన్ ఇండియా ఇంకా వెల్లడించాల్సి ఉంది.

కమల్ హాసన్ సినీ కెరీర్ ఇలా

కమల్ హాసన్ సినీ కెరీర్ ఇలా

ఇక కమల్ హాసన్ కెరీర్ విషయానికి వస్తే... శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రం షూటింగును పూర్తి చేయాల్సి ఉంది. అలాగే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషన్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X