రజినీతో కమల్ హాసన్ కు పెద్ద సమస్య.. జన్మలో దగ్గరవ్వనని లోకనాయకుడు నిర్ణయం.. ఏమైంది?
లోకనాయకుడు కమల్ హాసన్ కోలీవుడ్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తమళ చిత్రాల్లో నటించి మెప్పించారు. 60వ దశకం నుంచే వెండితెరపై ప్రేక్షకులను అలరించడం ప్రారంభించారు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం కలిగి ఉన్న కమల్ హాసన్ ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తుండటం విశేషం. ఇండియాలోనే ప్రముఖ నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్ గా కమల్ హాసన్ ఇప్పటికీ సినిమాలు చేస్తుండటం విశేషం. విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా, కొరియోగ్రాఫర్ గా, నిర్మాతగా సినిమా రంగంలో ప్రధానమైన విభాగాల్లో ఆరితేరారు కమల్ హాసన్.
ఇప్పటి వరకు కమల్ హాసన్ 230కి పైగా సినిమలు చేశారు. 70 ఏళ్ల వయస్సు పైబడినా ఇప్పటికీ ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు కమల్ హాసన్. అంతే కాదు తన ఫిట్ నెస్ తోనూ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. 'విక్రమ్' వంటి చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించి మెప్పించారు. ఈ వయస్సుల్లోనూ కమల్ హాసన్ కు ఎలా సాధ్యమవుతుందంటూ ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. ఇక 'కల్కి2'తోనూ కమల్ హాసన్ మైండ్ బ్లాక్ లుక్ లో కనిపించారు. ఏకంగా తన లుక్ కోసం గంటల తర్వాత మేకప్ కు సమయం కేటాయించడమంటే మాటలు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు గడిచిపోతూనే ఉంటాయి.

అయితే కమల్ హాసన్ తర్వాత కోలీవుడ్ లో మాట్లాడుకోవాల్సిన నటుడు రజనీకాంత్. ఆయన జీవితం గురించి అంతో కొంతో సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. కండక్టర్ నుంచి టాప్ హీరోగా ఆయన ఎదిగిన తీరుకు ప్రశంసనీయం. ఎంతో మంది నటీనటులు, ప్రజలకు కూడా స్ఫూర్తిదాయకం. అయితే కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో సమకాలీకులు కావడం విశేషం. 1975 నుంచి ఇద్దరి సినీ ప్రయాణం ప్రారంభమైంది. కోలీవుడ్ ను వారిద్దరూ వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు. విభిన్నప్రాజెక్ట్స్ ల్లో నటించి సౌత్ సినిమాలకు మంచి పేరు తీసుకొచ్చారు. మరోవైపు దక్షిణాది నటుల్లో కమల్ హాసన్, రజనీకాంత్ పేరు వింటేనే చాలు ఇండియా షేక్ అయ్యేలా ఎదిగారు.
అయితే.... కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని అభిప్రాయ బేధాలు ఉన్నాయంటూ పలువురు చర్చించుకున్న సందర్భాలున్నాయి. అయితే సినిమాల పరంగా మాత్రం వీరిద్దరూ ఎప్పుడూ కలవబోరనేది కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో అర్థమవుతుంది. అప్పుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి మల్టీస్టారర్ గా ఒక సినిమా చేయాల్సి వచ్చిందంట. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చిందంట. కమల్ హాసన్ అప్పటికే కాస్తా సీనియర్ కావడంతో తను నిర్మాత రూ.1.75 రెమ్యునరేషన్ ఇచ్చారంట. ఇక రజనీకాంత్ కు రూ.1 లక్ష మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చారంట. దాంతో కమల్ హాసన్ కు నిర్మాతపై కోపం వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ లో అటు రజనీకాంత్, ఇటు కమల్ హాసన్ ఇద్దరూ నష్టపోతుండటంతో ఇకపై కలిసి నటించొద్దని నిర్ణయించుకున్నారంట. ఆ సినిమా పూర్తికాగా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇకపై తాము కలిసి సినిమాలు చేయడం కుదరని అనౌన్స్ చేశారంట. అప్పటి నుంచి ఒక్క సినిమా కలిసి చేయలేదంట. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం అనేది ఈ జన్మలో జరగదని కూడా కమల్ హాసన్ స్పష్టం చేశారు. అయితే ఆ మధ్య రాజకీయ పార్టీల విషయాల్లోనూ వీరు విడివిడిగానే ఉన్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఆయా విషయాల్లో కమల్ హాసన్, రజనీకాంత్ కు మధ్య ఇలాంటి దూరాలు పెంచే నిర్ణయాలు చాలానే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











