దేశంలో తొలి టెర్రరిస్టు హిందువే.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
విలక్షణ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత తొలి టెర్రరిస్టు నాథురాం గాడ్సే అంటూ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహాత్ముడిని చంపిన నాథురాం గాడ్సేనే ముమ్మాటికి దేశానికి తొలి ఉగ్రవాది అని అన్నారు. దాంతో హిందూత్వవాద సంస్థలన్నీ కమల్ హాసన్ వ్యాఖ్యలపై దుమారం సృష్టించాయి.
తమిళనాడులోని అవరకురిచిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఇది ముస్లీం ప్రభావిత ప్రాంతమని నేను మాట్లాడటం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడి మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది నాథురాం గాడ్సేనే అని అన్నారు.

తాను నిజమైన దేశ భక్తుడిని, జెండాను, మూడు రంగులను అమితంగా అభిమానించే భారతీయుడిని అని కమల్ అన్నారు. 2018లో రాజకీయ ప్రవేశం చేసిన కమల్ హాసన్ ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించలేదు. కాకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనేది తెలిసిందే.
గతంలో భారత, పాకిస్థాన్ రాజకీయవేత్తలు సరిగా వ్యవహరిస్తే ఏ ఒక్క సైనికుడు మరణించడు. నియంత్రణారేఖ మన అధీనంలో ఉంటుంది అని కమల్ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత రాజకీయ పక్షాలు విరుచుకుపడటంతో మళ్లీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్నారు.


Click it and Unblock the Notifications











