twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుష్బూకు చేదు అనుభవం.. పోరాడి ఓడిన ఒకే ఒక్కడు కమల్‌హాసన్.. అయినా ప్రశంసల వెల్లువ

    |

    తమిళనాడు ఎన్నికల్లో సినీ తారలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొందరు విజయాన్ని సొంతం చేసుకొంటే మరికొందరు ఓటమి బారిన పడి అభిమానులను నిరాశపరించారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్, నటులు కమల్ హాసన్, కుష్పు, విజయ్ వసంత్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తాజా వెల్లడైన తాజా ఫలితాల్లో డీఎంకే పార్టీ తరఫున ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ్ వసంత్ విజయం సాధించగా, ప్రముఖ నటులు కమల్ హాసన్, కుష్బూ పరాజయం పాలయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Filmibeat Telugu
    అందరి దృష్టి కమల్ హాసన్‌పైనే

    అందరి దృష్టి కమల్ హాసన్‌పైనే

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి విలక్షణ నటుడు కమల్ హాసన్‌పైనే పడింది. మక్కల్ నీది మైయామ్ పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. దక్షణ కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన కమల్‌కు బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రసిడెంట్ మయూర జయకుమార్ బరిలో నిలిచారు.

    నువ్వా? నేనా అన్నట్టు

    నువ్వా? నేనా అన్నట్టు

    అయితే తాజా ఫలితాల్లో కమల్ హాసన్ ఒంటరి పోరాటం చేసి ఓటమి పాలయ్యారు. పలు రౌండ్లపాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన కౌంటింగ్ అందరిలోను ఆసక్తిని నింపింది. చివరి రౌండ్ వరకు విజయం వరిస్తుందనే అంశం ఉత్కంఠను రేపింది. ఈ ఎన్నికలో కమల్ హాసన్ తన ప్రత్యర్థి వనమా చేతిలో సుమారు 1358 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

    మూడు దశాబ్దాల కాలంలో డబ్బు, మద్యం లేకుండా

    మూడు దశాబ్దాల కాలంలో డబ్బు, మద్యం లేకుండా

    కమల్ హాసన్ ఓటమిపాలు కావడం అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో నిరాశను కలిగించినా.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ఉపయోగించకుండా విజయం అంచు వరకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు దశాబ్దాల్లో పైసా ఖర్చు చేయకుండా పోటీ చేసిన ఏకైక నేత అంటూ కమల్‌ను కొనియాడుతున్నారు.

    కుష్బూ దారుణ పరాజయం

    కుష్బూ దారుణ పరాజయం

    ఇదిలా ఉండగా, ఎన్నికల ముందు బీజేపీలో చేరిన సీనియర్ నటి కుష్బూకు భారీ పరాజయాన్ని మూటగట్టుకొన్నారు. డీఎంకే పార్టీకి చెందిన ప్రత్యర్థి చేతిలో ఊహించని ఓటమి పాలయ్యారు. దాదాపు 34 వేల ఓట్ల తేడాతో దారుణంగా ఓటమిని చవిచూశారు. దీంతో ఆమెకు భారీ ఎదురుదెబ్బే కాకుండా చేదు అనుభవాన్ని చవిచూసింది.

     ఉదయనిధి స్టాలిన్, విజయ్ వసంత్ విజయం

    ఉదయనిధి స్టాలిన్, విజయ్ వసంత్ విజయం

    ఇక సినీతారల్లో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి సుమారు 68 వేల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే విజయ్ వసంత్ అనే నటుడు కన్యాకుమారి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదాపు 120000 ఓట్లతో విజయం సాధించి ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు.

    English summary
    ctor Kamal Haasan and Kushboo had lost in Tamilnadu Assembly Elections 2021. Kamal Haasan lost in Coimbatore South assembly segment with margin of 1358 Votes. kushboo lost in Thousand Lights constituency with margin of 68 thousand Votes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X