twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ చిత్రానికి యువన్‌ సంగీతం

    By Srikanya
    |

    చెన్నై : కమల్ హాసన్ సినిమాకు సంగీతం అందించటం అంటే కత్తి మీద సామే అంటారు...అలాంటి అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు యవన్ శంకర్ రాజా.

    లింగుస్వామి నిర్మాతగా తిరుపతి బ్రదర్స్‌ బ్యానరుపై కమల్‌హాసన్‌ ఓ చిత్రంలో నటించనున్నాడు. దర్శకత్వం కూడా కమలే. 'విశ్వరూపం 2' ముగిశాక.. ఇది ప్రారంభమవుతుంది. దీని ద్వారా కమల్‌ చిత్రానికి తొలిసారిగా యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నాడు.

    కమల్‌ మాట్లాడుతూ... ''నా సినిమాకు యువన్‌ సంగీతం సమకూర్చాలని చాలా రోజులుగా ఆశపడ్డా. అది లింగుస్వామి చిత్రం ద్వారా నెరవేరుతోంది. చాలా సంతోషంగా ఉన్నాను'' అని తెలిపారు.

    ఇళయరాజా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, కాస్త పాశ్చాత్యాన్ని మేళవించి.. యువతను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా. 'తల' అజిత్‌ సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ ఆస్థాన విద్వాంసుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌తో కలిసి పనిచేయనున్నాడు.

    English summary
    
 Kamal Haasan in Lingusamy's film, music by Yuvan is Confirmed. Kaml says that he is much more intrest to work with Yuvan Shankar Raja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X