Kamal Haasan: 35 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో రిపీట్.. లెజండరీ డైరెక్టర్ తో కమల్ హాసన్

లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. విభిన్నమైన సినిమాలతోపాటు విభిన్నమైన రోల్స్ చేస్తూ ఆద్యంతం సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో. ఇప్పటివరకు కమల్ హాసన్ సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. ఇక ఇటీవల నటించన విక్రమ్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

దాదాపుగా అన్ని భాషల్లో సాలిడ్ హిట్ కొట్టింది. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన విక్రమ్ తర్వాత కమల్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరో క్రేజీ కాంబోకు సంబంధించి అప్ డేట్ వచ్చింది.

10 పాత్రల్లో రిస్కీ మేకప్ తో..

10 పాత్రల్లో రిస్కీ మేకప్ తో..

యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ఒక నటవిశ్వరూపం. పాత్రల్లో వైవిధ్యం చూపించడమే కాదు సినిమాలను కూడా వైవిధ్యంగా తెరకెక్కించాలనుకునే సినీ ప్రేమికుడు. నటుడిగా ఆయనకున్న డెడికేషన్ ఏంటో దశవతారం చూస్తే అర్థమవుతుంది. మొత్తం 10 పాత్రల్లో రిస్కీ మేకప్ తో పది రోల్స్ లో వేరియేషన్స్ చూపించి నిజంగా యూనివర్శల్ హీరో అనిపించుకున్నారు. ఆ మధ్య సరిగ్గా కమల్ సరైన హిట్ పడలేదు.

క్యారెక్టర్ కు కొనసాగింపుగా..

క్యారెక్టర్ కు కొనసాగింపుగా..

నాలుగేళ్లకు విక్రమ్ ద్వారా అదిరిపోయే కమ్ బ్యాక్ వచ్చింది. దీంతో తన సత్తా ఏంటో మళ్లీ చూపించారు కమల్ హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన "విక్రమ్: ది హిట్ లిస్ట్" మూవీని సుమారు 36 ఏళ్ల క్రితం వచ్చిన "ఏజెంట్ విక్రమ్ 007" చిత్రంలోని క్యారెక్టర్ కు కొనసాగింపుగా తెరకెక్కించారు. విక్రమ్ 2 (విక్రమ్: ది హిట్ లిస్ట్) సినిమా తర్వాత కూడా మరో చిత్రం వస్తుందని వార్తలు అయితే వచ్చాయి.

లోకీ యూనివర్స్..

లోకీ యూనివర్స్..

ఇదంతా లోకీ (డైరెక్టర్ లోకేష్ కనకరాజ్) యూనివర్స్ లో భాగంగా రూపొందిస్తారని ఒక టాక్ అయితే ఉంది. కమ్ బ్యాక్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు లోక నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమాను కమల్ హాసన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.

కలిసొచ్చిన ఆలస్యం..

కలిసొచ్చిన ఆలస్యం..

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది ఈ భారతీయుడు 2 సినిమా. ఈ చిత్రంలో ముందుగా బ్యూటిఫుల్ చందమామ కాజల్ అగర్వాల్ అండ్ ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా తీసుకున్నారు. కానీ కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్తలు వచ్చాయి. మరోవైపు భారతీయుడు 2 షూటింగ్ కూడా ఆలస్యమైంది. ఇదంతా కాజల్ కు కలిసి వచ్చింది.

సెన్సేషన్ అయిన నాయకన్..

సెన్సేషన్ అయిన నాయకన్..

ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రీకరణలో పాల్గొంటుంది కాజల్ అగర్వాల్. ఇదిలా ఉంటే ఈ చిత్రాలే కాకుండా తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టారు కమల్ హాసన్. 1987లో కమల్ హాసన్ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించిన సినిమా నాయకన్ (నాయకుడు). అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనంగా మారింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించనున్నారు కమల్ హాసన్.

కమల్ హాసన్ 234వ సినిమాగా..

సుమారు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. కమల్ హాసన్ 234వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. మద్రాస్ టాకీస్, రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఇవాళ ప్రకటించారు. అయితే ఈ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం నిర్మాణంలో కమల్ హాసన్ కూడా భాగస్వామ్యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X