రాముడు కాదు.. ఆయన తండ్రి దశరథుడు నాకు ఆదర్శం.. పెళ్లిపై షాకింగ్‌గా కమల్ హాసన్
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న థగ్ లైఫ్ మూవీ సాంగ్ లాంఛ్ వేడుక చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాలో శింబు, త్రిషా కృష్ణన్, సన్య మల్హోత్రా, అశోక్ సెల్వన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, నాజర్, పంకజ్ త్రిపాఠి, మహేష్ మంజ్రేకర్ తదితరులు నటించారు. ఈ సినిమాను కమల్ హాసన్, మహేంద్రన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. జూన్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా సాంగ్ రిలీజ్ వేడుకలో పెళ్లిపై కమల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కమల్ ఏం మాట్లాడారనే వివరాల్లోకి వెళితే..
థగ్ లైఫ్ సినిమా ఈవెంట్‌లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. అయితే త్రిషను అడిగితే.. ఆమె సమాధానం ఇస్తూ.. పెళ్లి ఎప్పుడు జరిగిన సంతోషమే. అది జరగకపోయినా సంతోషమే అని త్రిష తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అయితే త్రిష ఇచ్చిన సమాధానానికి మరింత కొనసాగిస్తూ.. తన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు.

గతంలో జాన్ బ్రిటాస్ అనే ఎంపీ, జర్నలిస్టు నన్ను ఇంటర్వ్యూ చేశారు. మీరు మంచి బ్రహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. మీరు రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకొన్నారు? అని ఆయన పెళ్లి గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేయమని అడిగారు. దాంతో నా పెళ్లికి, నా కుటుంబ ప్రతిష్టకు సంబంధమేమిటి? నేను రెండు పెళ్లిళ్లు చేసుకొంటే అది దిగజారే ప్రమాదం ఏముంది? అని సమాధానం ఇచ్చానని కమల్ తెలిపారు.
పురాణాల్లో దేవుడిగా భావించే రాముడిని ఏకపత్నీవ్రతుడు అని అంటారు. మీరు ఆయనను ఆదర్శం ఎందుకు తీసుకోలేదని మరోసారి ఆ ప్రశ్నను కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే సాధారణంగా నేను దేవుడిని ప్రార్థించను. నేను రాముడు నడిచిన మార్గాన్ని ఫాలో అవ్వను. నేను రాముడి తండ్రి, ముగ్గురు భార్యలను చేసుకొన్న దశరథుడి బాటలో నడుస్తానని చెప్పాను అని అన్నారు.
ఇక కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన ముందుగా వాణి గణపతిని వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత నటి సారికను పెళ్లి చేసుకొన్నారు. వారిద్దరికి శృతిహాసన్, అక్షరహాసన్ సంతానం. ఆ తర్వాత సారిక నుంచి విడిపోయారు. గౌతమితో సహజీవనం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కూడా ఇటీవల విడిపోయారు.
తమిళనాట రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న కమల్ హాసన్.. ఇటీవల విక్రమ్, ఇండియన్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా మణిరత్నంతో కలిసి థగ్ లైఫ్ సినిమాతో వస్తున్నాడు. ఇంకా విక్రమ్ 2 మూవీ, ఇతర సినిమాలతో సిద్దమవుతున్నారు. ఇంకా పలు సినిమాలు చర్చల దిశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











