కమల్ హాసన్ కొత్త చిత్రం 'సూపర్ స్టార్ ' ...పూర్తి డిటేల్స్

మరో ప్రక్క కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌హాసన్ ఓ సినిమాలో నటించనున్నారు. 'విశ్వరూపం 2' రూపకల్పనలో ఉన్న కమల్.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తిచేసి.. నిర్మాణాంతర పనుల్లో నిమగ్నమయ్యారు. అవి పూర్తయ్యాక రమేష్ అరవింద్‌తో సినిమా చేయనున్నారు.
'పంచతంత్రం'లో కమల్‌తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు రమేష్. ఆయన మాట్లాడుతూ.. '' నేను, కమల్ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్‌తో 'ఉత్తమ విల్లన్' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్‌ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు.
'ఉత్తమ విలన్' చిత్రంలో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం కాగా, కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం. ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications











