ముగ్గురు హీరోయిన్లతో కమల్ క్రేజీ ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్‌తో సెన్సేషనల్ సీక్వెల్

విలక్షణ నటుడు కమల్ హాసన్ మరో సంచలనానికి తెర లేపారు. ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొంటూ.. పలు దశాబ్దాలుగా భారతీయ సిని పరిశ్రమకు విశేష సేవలందిస్తున్న కమల్.. తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. 1992లో వచ్చిన క్షత్రియ పుత్రుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేయడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు దక్షిణాది మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు మీ కోసం..

క్షత్రియ పుత్రుడు సీక్వెల్‌లో

క్షత్రియ పుత్రుడు సీక్వెల్‌లో

ప్రస్తుతం సినీ, రాజకీయ కార్యకలాపాలతో కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. ఓ చేత్తో రాజకీయాలను, మరో చేత్తో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్‌లో నటిస్తూనే మరో సెన్సేషనల్ సీక్వెల్‌కు శ్రీకారం చుట్టారు. క్షత్రియ పుత్రుడు సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాతో కలిసి తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ఇండియన్ 2 సినిమాకు లైకానే నిర్మాతగా వ్యవహరించడం తెలిసిందే.

ఏఆర్ రెహ్మాన్, విజయ్ సేతుపతి

ఏఆర్ రెహ్మాన్, విజయ్ సేతుపతి


ఎన్నికలకు ముందే పలు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న కమల్ హాసన్ క్షత్రియపుత్రుడు సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దించారు. ఈచిత్రంలో నాజర్ కుమారుడి పాత్రలో సేతుపతి కనిపించబోతున్నారట. క్షత్రియ పుత్రుడులో నాజార్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇలా సంచలనమైన రీతిలో ప్రాజెక్టుపై క్రేజ్‌ను పెంచారు.

రేవతి, వడివేలు రంగంలోకి

రేవతి, వడివేలు రంగంలోకి


ఇక క్షత్రియపుత్రుడు సినిమాలో రేవతి, వడివేలు పాత్రలు అత్యంత కీలకం. రేవతి సినిమాను ఎమోషనల్‌గా మారిస్తే.. వడివేలు మూవీని హస్యరంజకంగా మార్చారు. ఈ సినిమాలో నటిస్తున్న సందర్భంగా వడివేలు మాట్లాడుతూ.. 21 ఏళ్లుగా కమల్‌తో నాకు అనుబంధం ఉంది. మళ్లీ ఆయనతో నటిస్తుండటం హ్యాపీగా ఉందని అన్నారు. ఈ సీక్వెల్‌లో ఈ ఇద్దరిని కూడా తీసుకొన్నట్టు తాజా సమాచారం. తమిళంలో ఈ చిత్రానికి థలైవన్ ఇరుక్కిరాన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.

ఆండ్రియా, పూజా కుమార్

ఆండ్రియా, పూజా కుమార్


క్షత్రియపుత్రుడు సినిమా సీక్వెల్‌లో మరో ఇద్దరు హీరోయిన్లకు చోటుకల్పించారు. తనతో విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాల్లో నటించిన ఆండ్రియా జెర్మియా, పూజా కుమార్‌లను కీలక పాత్రల కోసం ఎంపిక చేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నదని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Recommended Video

Vakeel Saab : Shruti Haasan To Pair Up With Pawan Kalyan In Vakeel Saab?
సామాజిక, సమకాలీన అంశాలతో

సామాజిక, సమకాలీన అంశాలతో

ఇలాంటి ప్రత్యేకతలతో రూపొందున్న క్షత్రియపుత్రుడు2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించడానికి లైకా ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో కులం, విద్యావ్యవస్థలోని లోపాలు, ఆర్థిక వ్యవస్థలోని లొసుగులు, రాజకీయాలు ప్రదాన అంశాలుగా ఉంటాయని తెలిసింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X