ఇండియన్2పై రూమర్లు.. కమల్ రియాక్షన్ ఏంటంటే..
విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినీరంగంపై కూడా దృష్టిపెట్టారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇండియన్2 సినిమా గురించి మీడియాలో రూమర్లు భారీగా వస్తున్నాయి.
అయితే కమల్ మేకప్ సమస్య వల్ల ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఆగిపోయింది. మేకప్ సరిగా కమల్ కుదరలేదు. అందుకే షూటింగ్‌ను కొంతకాలం నిలిపివేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది అనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

ఇండియన్2 సినిమాపై వస్తున్న రూమర్లపై కమల్ హాసన్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఆగిపోలేదు. మేకప్ సమస్యలు ఏవీ లేవు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే అని చెప్పారు. త్వరలోనే రెగ్యులర్‌గా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
గతంలో ఆగిపోయిన శభాస్ నాయుడు, మరో చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో కూడా ఉన్నాను. ఎన్నికల లోపుగానీ, ఆ తర్వాత గానీ వాటిపై దృష్టిపెడుతానని కమల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











