కమల్ హాసన్ పిలవండి.. అలా పిలువొద్దు.. అజిత్ తర్వాత లెజెండరీ యాక్టర్ సంచలన నిర్ణయం
భారతీయ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకుల మదిలో కమల్ హాసన్ నిలిచిపోయారు. దాదాపు 4 దశాబ్దాల కాలంగా సినిమా పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయనను అభిమానులు ఉలగనాయకన్ అని ముద్దుగా పిలచుకొంటారు. అయితే తనను ఆ బిరుదుతో పిలువ కూడదని ఆయన సూచిస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆయన లేఖ వివరాల్లోకి వెళితే..
మీరు నన్ను ఉలగనాయగన్ అని పిలుచుకొంటూ ప్రేమను కురిపించడం తీర్చుకోలేని రుణం. నా మిత్రులు, అభిమానులు, సహచర నటులు, నన్ను ఆరాధించే వాళ్లు అలా నాపై ప్రేమ కురిపించడం నన్ను ఎప్పుడూ కదిలిస్తుంటుంది. సినిమా నిర్మాణమనే ఓ కళ ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు. ఇప్పటికీ నేను నిత్యం ఓ విద్యార్థిగా ప్రతీ ఆర్ట్‌ను నేర్చుకొంటూనే ఉంటాను. క్రియేట్ ఎక్స్‌ప్రెషన్‌గా భావించే సినిమా ప్రతీ ఒక్కరిది. ఎంతో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషి మాత్రమే. కథలో విభిన్నత, మానవత్వాన్ని చూపించే ప్రతీ కథను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని తన లేఖలో కమల్ హాసన్ పేర్కొన్నారు.

కళ కంటే ఆర్టిస్టు ఎప్పుడు గోప్పవాడు కాదనేది నా ప్రగాఢ నమ్మకం. దానిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే ఎప్పుడూ వినమ్రంగా ఉంటాను. నాలోని లోపాలను సవరించుకొంటూ ప్రతీ విషయంలో మెరుగైన విధంగా ఉండేందుకు బాధ్యతగా ఉంటాను. అయితే నా పేరుకు ముందో.. పక్కనో ఎలాంటి బిరుదులు, ట్యాగ్స్ ఫెట్టకూడదని భావిస్తాను అని కమల్ అన్నారు.
భారతీయ ప్రేక్షకులకు, నా పార్టీ కార్యకర్తలకు, సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులు, నా ఫ్యాన్స్‌కు నేను కోరేది ఏమిటంటే.. నన్ను ఇక నుంచి ఉలగనాయగన్ అని పిలవకండి. కేవలం కమల్ హాసన్, లేదా కమల్, కేహెచ్ సింపుల్‌గా పిలవండి. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంంది అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా నాపై కురిపిస్తున్న అభిమానానికి థ్యాంక్యూ. నేను ఎక్కడి నుంచి వచ్చాననే విషయం.. నా రూట్స్, నా లక్ష్యాన్ని గుర్తుంచుకొనేందుకు అలాగ, మీలో ఒక్కడిగా, కళామతల్లి ఓడిలో ఒక్కడిగా ఉండిపోవాలన్న కోరికతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాను అని కమల్ హాసన్ తెలిపారు. ఇక నుంచి నన్ను అలా పిలవకండి అని సూచించారు. గతంలో అజిత్ కూడా తనకు ఉన్న బిరుదుతో పిలవకూడదని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











