కమల్ హాసన్ కారుపై యువకుడి దాడి.. ఏం జరిగిందంటే
దేశం గర్వించ దగిన విలక్షణ నటుడు, మక్కల్ నీధి మైయామ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వ్యక్తి అడ్డుకొని దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. పార్టీ ప్రచారం కోసం వెళ్తుండగా ఈ దారుణ ఘటన కాంచీపురంకు సమీపంలో జరిగినట్టు సమాచారం.
తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కమల్ హాసన్ తన ప్రచార జోరును పెంచారు. ఈ క్రమంలో ఆదవారం రాత్రి హోటల్‌కు వెళ్తుండగా యువకుడు దాడి చేసినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ దాడి నుంచి కమల్ హాసన్ క్షేమంగా తప్పించుకొన్నారు. అయితే కారు అద్దాలు పగిలిపోగా, పాక్షికంగా వాహనం ధ్వంసమైంది అని పోలీసులు పేర్కొన్నారు.

కమల్ కారుపై దాడి జరిగిందనే వార్త తెలియగానే స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. వెంటనే దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి కారణం గురించి ప్రశ్నిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు మద్య మత్తులో ఉన్నారని, కొందరు ఎంఎన్ఎం పార్టీ కార్యకర్తలను కూడా గాయపరచడానికి ప్రయత్నించాడని తెలిసింది.
కమల్‌పై దాడి విషయాన్ని ఎంఎన్ఎం పార్టీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏజీ మౌర్య ట్వీట్ చేసి తెలియజేశారు.


Click it and Unblock the Notifications











