twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సేషనల్ మూవీకి సీక్వెల్.. ఇండియన్ 2 ఎఫెక్ట్‌తో కమల్ సంచలన నిర్ణయం

    |

    ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విలక్షణ నటుడు కమల్ హాసన్... తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టినట్టు కోలీవుడ్‌లో చర్చ జరుగుతున్నది. ఎన్నికల ఫలితాల తర్వాత తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన క్షత్రియ పుత్రుడు సినిమాకు సీక్వెల్‌గా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో కమల్ ఉన్నట్టు సమాచారం.

    ఇటీవల ప్రారంభమైన ఇండియన్ 2 సినిమా ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోవడం తెలిసిందే. ఇండియన్ 2 సినిమా షూట్ నిరవధికంగా వాయిదా పడటంతో మరో సినిమా గురించి కమల్ నిర్ణయం తీసుకొన్నాడనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

    ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూనే క్షత్రియపుత్రుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులను వేగవంతం చేశాడని, త్వరలోనే అధికారికంగా ఈ సినిమా గురించి ప్రకటన చేస్తారనే విషయం తమిళ మీడియా కథనాల్లో కనిపించింది. క్షత్రియ పుత్రుడు సినిమాను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొలాచిలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లో షూట్‌ను ముగించేలా ప్లాన్ చేస్తున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

    షాకింగ్.. ప్రియుడితో శృతి హాసన్ బ్రేకప్.. మైఖెల్ కోర్సెల్ ఎమోషనల్‌గా!షాకింగ్.. ప్రియుడితో శృతి హాసన్ బ్రేకప్.. మైఖెల్ కోర్సెల్ ఎమోషనల్‌గా!

    Kamal Haasans Devar Magan 2 on cards after election results

    క్షత్రియ పుత్రుడు సినిమా తమిళ భాషలో దేవర్ మగన్ పేరుతో 1992లో రిలీజైంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, శివాజీ గణేసణ్, రేవతి, గౌతమి, నాజర్ తదితరులు నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందించిన పాటలు అత్యం ప్రజాదరణ పొందాయి.

    ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇండియన్ 2 సినిమాను ఘనంగా ప్రారంభించారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. అంతా సవ్యంగా జరుగుతున్నదనే సమయంలో సినిమాను వాయిదా వేయడం షాక్ గురి చేసింది. ఈ నేపథ్యంలో క్షత్రియ పుత్రుడు సినిమాను ఎన్నికల ఫలితాల తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది.

    English summary
    After Shankar's Indian 2 postpone, Kamal Haasan is planning to make sequel to Devar Magan, Which released Kshatriya Putrudu in Telugu. 1992 released film directed by Bharathan. The film stars Sivaji Ganesan, Kamal Haasan, Revathi, Gautami and Nassar. The film's soundtrack album and background score were composed by Ilaiyaraaja while the cinematography was handled by P. C. Sreeram. The film's script was written by Kamal Haasan who also produced the film along with his brother Chandrahasan under Raaj Kamal Films International.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X