2.0తో మునిగిపోయాం.. శంకర్‌తో నిర్మాతల ఫైట్, భారతీయుడు2 ఆగిపోయినట్లేనా!

Recommended Video

Indian 2 Movie First Look : Kamal Haasan Returns As Senapathy | ‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్

స్టార్ డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజని 2.0 తర్వాత మరో బిగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్2 సీక్వెల్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2.0 చిత్రానికి నిర్మించిన లేక ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించేందుకు సిద్ధం అయింది. చిత్రం ప్రారంభమయ్యాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తమిళ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనితో భారతీయుడు 2 చిత్రం ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

23ఏళ్ల తర్వాత

23ఏళ్ల తర్వాత

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ 1996లో విడుదలయింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు శంకర్ ప్లాన్ చేశారు. భారతీయుడు చిత్రంలో వృద్దుడిగా కమల్ నటన అద్భుతం. ఆలోచింపజేసే సందేశాత్మక అంశాలతో కళాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

 2.0 విడుదల కాగానే

2.0 విడుదల కాగానే

గత ఏడాది 2.0 చిత్రం విడుదల కాగానే శంకర్ భారతీయుడు 2 చిత్ర పనులు ప్రారంభించాడు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. భారతీయుడులో కనిపించిన ఓల్డ్ మాన్ లుక్ లోనే కమల్ ఈ చిత్రంలో కూడా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈచిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. నిర్మాతలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

 మునిగిపోయాం

మునిగిపోయాం

దర్శకుడు శంకర్ భాతీయుడు2 చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు. 2.0 చిత్రానికి 500 కోట్లకు పైగా ఖర్చయింది. 2.0తో తాము తీవ్రంగా నష్టపోయామని, భారతీయుడు 2ని మీడియం బడ్జెట్ లో తెరక్కించాలని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాతలు కోరారట. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించడం కుదరదని, అలా చేస్తే క్వాలిటీ దెబ్బ తింటుందని శంకర్ చెప్పడంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆగిపోయే పరిస్థితి

ఆగిపోయే పరిస్థితి

శంకర్ అడిగినంత బడ్జెట్ ఇచ్చే స్థితిలో లైకా సంస్థ లేదని తెలుస్తోంది. ఇక శంకర్ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే దర్శకుడు కాదు. దీనితో శంకర్ తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో నిర్మాత దొరికితే భారతీయుడు 2 షూటింగ్ తిగిరి ప్రారంభం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X