Don't Miss!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
16 ఏళ్ల హీరోయిన్‌కు తెలియకుండా.. డైరెక్టర్ బలవంతంగా.. వివాదంలో కమల్ ముద్దు సీన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ లిప్‌లాక్స్‌కు ఫేమస్ అనే విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాల్లో ముద్దు సీన్లు సర్వసాధారణం. తాజాగా కమల్, రేఖ కలిసి నటించిన ఓ ముద్దు సీన్‌పై రగడ కొనసాగుతున్నది. 1986లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వం వహించిన పున్నాగై మన్నన్ (తెలుగులో డ్యాన్స్ మాస్టర్) సినిమాలోని ఓ సీన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ముద్దు విషయంపై ఆ సీన్‌లో నటించిన హీరోయిన్ రేఖ వెల్లడించిన ఇంటర్వ్యూ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.

సినిమాకు కీలకంగా సన్నివేశం
పున్నాగై మన్నన్ చిత్రంలో అది కీలకమైన సన్నివేశం. ప్రేమను పెద్దలు అంగీకరించిన క్రమంలో వారిద్దరూ ఓ జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకొనే సీన్. అయితే ఆ సీన్ చిత్రీకరించడానికి ముందు వరకు నాకు చెప్పలేదు. సీన్ చిత్రీకరించే ముందు.. కమల్ నేను చెప్పింది గుర్తుందా? కళ్లు మూసుకో అని బాలచందర్ అన్నారు. దాంతో నన్ను గాఢంగా ముద్దు పెట్టుకొన్నారు అని రేఖ అన్నారు.

నా వయసు 16 ఏళ్లు
కమల్‌తో ముద్దు పెట్టుకొన్న సీన్‌లో నటించేటప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. నేను అప్పుడే 10వ తరగతి పాస్ అయ్యాను. ఈ సీన్ తర్వాత నేను ఓ రకమైన షాక్ గురయ్యాను. ఆఅలాంటి సీన్ ఉంటుందని నాకు చెప్పలేదు. ఆ సీన్ తర్వాత వేరే లొకేషన్‌కు వెళ్లేటప్పుడు నాతో ప్రయాణిస్తున్న అసోసియేట్ దర్శకులు సురేష్ కృష్ణ, వసంత్‌ను గట్టిగా నిలదీశాను.

నేను ఒప్పుకొనే దానిని కాదు
కమల్‌తో నాకు ముందు సీన్ ఉంటుందని ముందే ఎందుకు చెప్పలేదు. అలాంటీ సీన్లు ఉంటే నేను అంగీకరించే దానిని కాదు అని సురేష్ కృష్ణ, వసంత్‌ను అడిగితే, వారు ఓ పెద్ద రాజు చిన్నారి ముద్దు పెట్టుకొన్నారని ఊహించుకోమని చెప్పారు. అంతేకాకుండా సెన్సార్ వాళ్లు ఒప్పుకోరని చెబితే.. సెన్సార్ అంటే ఏమిటని అమాయకంగా అడిగానని రేఖ చెప్పారు.

ఆ ఇద్దరిని నిలదీశాను..
కమల్‌తో ఆ సీన్ గురించి జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఆ సీన్ గురించి ప్రతీసారి కావాలని అడుగుతుంటారు. నేను పదే పదే చెప్పినా వినిపించుకోకుండా అదే ప్రశ్నను అడిగి విసిగిస్తారు. ఇప్పటికి వందలసార్లు చెప్పాను. నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. కానీ సినిమాను థియేటర్‌లో చూసినప్పుడు ఆ సీన్‌కు ఉన్న ప్రాధాన్యత, ఇంటెన్సిటీ అర్ధమైంది. థియేటర్‌లో తెరపైన గొప్ప ఇంపాక్ట్ కనిపించింది అని రేఖ అన్నారు.

వందసార్లు చెప్పాను..
నా కెరీర్‌లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. చెడు సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు నన్ను స్విమ్ సూట్, షార్ట్స్, స్లీవ్‌లెస్ జాకెట్లు వేసుకొమని బలవంతం చేసే వారు. నేను ఎలాంటి మొహమాటం లేకుండా వారి ప్రతిపాదనలను తిరస్కరించే దానిని. వాన పాటలు చిత్రీకరిస్తే.. నల్ల చీర.. లేదా మందంగా ఉన్న చీరను అడిగి ధరించేదానిని అని రేఖ చెప్పారు.
Recommended Video

|
సింగర్ చిన్మయి ఘాటుగా
సీనియర్ నటి రేఖ ఇంటర్వ్యూను ట్వీట్ చేస్తూ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ఒకరి అంగీకారం, అనుమతి లేకుండా ముద్దు సీన్లు చిత్రీకరించారు. హీరోలకు చాలా సాధారణమైన విషయం. కానీ హీరోయిన్లకు అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలియదు. ఇప్పటికీ షూటింగ్‌లో డైరెక్టర్లు కొట్టడాలు, చెంపపెట్టు పెట్టడాలు జరుగుతున్నాయి అని చిన్మయి ట్వీట్‌లో పేర్కొన్నది.