కుమార్తెతో కమల్ హాసన్ భారీ బడ్జెట్ చిత్రం.. హీరో ఎవరో తెలుసా!
విశ్వనటుడు కమల్ హాసన్ కు సినిమారంగంలో తెలియని విద్య అంటూ లేదు. నటుడిగా ఆయన ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దర్శకుడిగా కూడా అబ్భురపరిచే చిత్రాలు చేశారు. నిర్మాతగా కూడా భారీ చిత్రాలు నిర్మించారు. మరోమారు కమల్ హాసన్ నిర్మాతగా అవతారం ఎత్తారు. ఈ చిత్రంలో ఆయన నటించడంలేదు.
కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. హీరో మరెవరో కాదు.. విలక్షణ నటుడు విక్రమ్. ఈ చిత్రం తాజగా ప్రారంభమైంది. రాజేష్ సెల్వ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

పలువురు స్టార్ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి. త్వరలో ఏ చిత్ర రెగ్యులర్ షూటింగ్ పార్రంభం కానుంది.


Click it and Unblock the Notifications











