‘విశ్వరూపం 2’ విడుదలకు లైన్ క్లియర్

By Bojja Kumar

కమల్ హాసన్ తాజా మూవీ 'విశ్వరూపం 2' ముందుగా అనుకున్న సమయానికే ఆగస్టు 10న విడుదలకు సిద్ధమవుతోంది. లీగల్ సమస్యలు, కరుణానిధి మరణం నేపథ్యంలో ఈ చిత్రం విడుదలపై నిన్నటి వరకు అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి.

కమల్ హాసన్ చెల్లించాల్సిన డబ్బు చెల్లించే వరకు ఆయన సినిమా ఆపాలని కొందరు కోర్టు కెక్కడం ఓ కారణమైతే, తమిళనాడులో మాజీ సీఎం కరుణానిధి మరణించిన నేపథ్యంలో సినిమా విడుదల ఉండక పోవచ్చనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Kamal Haasan’s team has clarified: Vishwaroopam 2 on August 10

అయితే ప్రజల్లో నెలకొన్న ఈ అనుమానాలను క్లియర్ చేస్తూ కమల్ హాసన్ టీమ్ ప్రకటన చేసింది. ముందుగా అనుకున్న ప్రకారమే ఆగస్టు 10న సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలువుతుందని తెలిపారు.

కాగా... కమల్ హాసన్ తమకు ఇవ్వాల్సిన రూ. 7.75 కోట్లు చెల్లించే వరకు 'విశ్వరూపం 2' విడుదల ఆపాలని పిరమిడ్ సైమిరా ప్రొడక్షన్స్ వేసిన పిటీషన్‌ను మద్రాస్ హైకోర్ట్ రిజక్ట్ చేసింది. దీంతో సినిమాకు విడుదలకు లైన్ క్లియర్ అయినట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X