కమల్ 'ఉత్తమ విలన్‌' ఫస్ట్‌లుక్‌ ఇదే

By Srikanya

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉత్తమ విలన్‌'. లింగుస్వామి సారథ్యంలోని తిరుపతి బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సమర్పకులు. తమిళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కమల్‌ హాసనే సమకూర్చారు. తమిళ వెర్షన్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ చైన్నైలో విడుదల చేశారు. తమిళ సంస్కృతికి అద్దంపట్టే 'విల్లుపాట్టు' (విల్లుపాట) పరికరం ఆకారంతో చిత్రం శీర్షికను రూపొందించారు.

ఇందులో కమల్‌కు ముగ్గురు హీరోయిన్లు ఉండేలా కథను సిద్ధం చేసుకున్నారు. త్రిష, తమన్నా, కాజల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. 'దృశ్యం' రీమేక్‌లో కమల్‌హాసన్‌ సరసన నటించేందుకు నదియా, సిమ్రాన్‌ల మధ్య పోటీ నెలకొందన్న వార్తల నేపథ్యంలో ఆయన మరో కొత్త చిత్రంలో త్రిష, తమన్నా, కాజల్‌ జోడీ కట్టనున్నారనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.

Kamal Haasan's 'Uthama Villain' first look revealed

వీరిలో త్రిష ఇప్పటికే కమల్‌తో 'మన్మథన్‌ అంబు'లో నటించగా, మిగతా ఇద్దరు మొదటిసారి ఆయనతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో తనతో పాటు తన గురువు కె.బాలచందర్‌ కూడా నటిస్తున్నారని, చిత్రంలోని పాత్రకోసం గడ్డం కూడా పెంచుతున్నానని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.

ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర రిలీజ్ హడావిడిలో బిజీగా ఉన్నారు. ఉత్తమ విలన్ తెరకెక్కనుంది. 'పంచతంత్రం'లో కమల్‌తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు రమేష్‌.

రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. '' నేను, కమల్‌ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్‌తో 'ఉత్తమ విల్లన్‌' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్‌ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్‌ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రా, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దత్‌, ఎడిటింగ్‌: విజయ్‌శంకర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X