కమల్ 'ఉత్తమ విలన్‌' కొత్త పోస్ట్రర్స్ ఇవే(ఫోటో ఫీచర్)

By Srikanya

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఉత్తమ విలన్‌'. లింగుస్వామి సారథ్యంలోని తిరుపతి బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సమర్పకులు. తమిళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కమల్‌ హాసనే సమకూర్చారు. తమిళ వెర్షన్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ చైన్నైలో రెండు రోజుల క్రితం విడుదల చేశారు. తమిళ సంస్కృతికి అద్దంపట్టే 'విల్లుపాట్టు' (విల్లుపాట) పరికరం ఆకారంతో చిత్రం శీర్షికను రూపొందించారు. ఇప్పుడు మరో రెండు పోస్టర్స్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కు పండుగ చేసారు.

ఈ కొత్త పోస్టర్స్ లో కమల్ చాలా అందంగా ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో ఆయన సినీ నటుడుగా కనిపించనున్నాడని ఈ పోస్టర్స్ తెలియచేస్తున్నాయి. ఈ పోస్టర్స్ తో కమల్ ఈ ప్రాజెక్టు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో తనతో పాటు తన గురువు కె.బాలచందర్‌ కూడా నటిస్తున్నారని, చిత్రంలోని పాత్రకోసం గడ్డం కూడా పెంచుతున్నానని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం.

ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర రిలీజ్ హడావిడిలో బిజీగా ఉన్నారు. ఉత్తమ విలన్ తెరకెక్కనుంది. 'పంచతంత్రం'లో కమల్‌తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు రమేష్‌.

కొత్త పోస్టర్స్ స్లైడ్ షో లో...

ఇ.టిని గుర్తు చేసే...

ఇ.టిని గుర్తు చేసే...

స్పీల్ బర్గ్ ఇటి ని గుర్తు చేసేటట్లు ఉన్న ఈ పోస్టర్ లో కమల్ తన అభిమానులకు ఎలా చేరువ అవుతున్నాడో తెలుపుతుంది. చిన్నా పెద్దా తేడాలేకుండా ఆయన అభిమానులు అంతటా ఉన్నారని, అదీ చిత్రంలో పాత్ర చిత్రణలో భాగమని అంటున్నారు.

కొత్తగా...

కొత్తగా...

కమల్ రెగ్యులర్ మూస ధోరణులకు ఎప్పుడూ వ్యతిరేకమే. ముఖ్యంగా చిత్రంలోతన పాత్ర చిత్రణతో ప్రేక్షకులును ఆకట్టుకోవాలని చూస్తాడు. అందుకు తగినట్లు గానే ఆయన మొదటి నుంచీ ప్రమోషన్ చేసుకుంటూ వస్తారు. అలాగే ఆర్టిస్టు పాత్ర కాబట్టి ఇలా డబ్బింగ్ థియోటర్ లో కూర్చున్నట్లు కమల్ స్టిల్ వేసి పోస్టర్ వదిలారు.

ఫస్ట్ లుక్ కి ప్రేరణ...

ఫస్ట్ లుక్ కి ప్రేరణ...

ఇప్పటికే రిలీజైన ఈ ఫస్ట్ లుక్ అంతటా మంచి ప్రాచుర్యం పొందింది. ఈ పోస్టర్... Theyyam of Malabar photo-expedition నుంచి ప్రేరణ పొందింది. మీరు ప్రక్కన చూస్తున్న ఫోటోలో మొదట ఒరిజనల్. రెండోది కమల్ ది.

ఇద్గరు మిత్రులు..

ఇద్గరు మిత్రులు..

ఇద్దరూ కె.బాలచందర్ స్కూల్ నుంచి వచ్చినవారే కావటంతో మంచి స్నేహితులు. నటనా పరంగా కూడా ఇద్దరూ ప్రయోగాలు చేసేవారు. అందులోనూ ఇద్దరికి మంచి స్నేహం ఉంది. దాంతో రమేష్ దర్శకత్వంలో చేయటానికి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

ముగ్గురూ...

ముగ్గురూ...

ఇందులో కమల్‌కు ముగ్గురు హీరోయిన్లు ఉండేలా కథను సిద్ధం చేసుకున్నారు. కాజల్, ఆసిన్, దీపికా పదుకోనిను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఏదీ ఫైనలైజ్ కాలేదు.

పూజా కుమార్...

పూజా కుమార్...

మరో ప్రక్క ఈ చిత్రంలో విశ్వరూపంలో మెయిన్ లీడ్ చేసిన పూజా కుమార్ మెయిన్ లీడ్ లో కనిపించనుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కమల్ తన హీరోయిన్స్ ఎప్పుడో కానీ రిపీట్ చేయాటనికి ఇష్టపడరు.

రీమేక్ లో...

రీమేక్ లో...

మరో ప్రక్క కమల్ 'దృశ్యం' రీమేక్‌ కమిటయ్యారు. మోహన్ లాల్ చేసిన పాత్రను కమల్ చేయనున్నారు. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ సరసన నటించేందుకు నదియా, సిమ్రాన్‌ల మధ్య పోటీ నెలకొంది.

రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. .

రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. .

'' నేను, కమల్‌ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్‌తో 'ఉత్తమ విల్లన్‌' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్‌ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్‌ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రా, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దత్‌, ఎడిటింగ్‌: విజయ్‌శంకర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X