కమల్‌ ‘ఉత్తమ విలన్‌’ విడుదల తేదీ ఖరారు

By Srikanya

చెన్నై: కమల్ కి దేశ,విదేశాల్లో ప్యాన్ పాలోయింగ్ ఉంది. విలక్షణ నటుడుగా పేరు గాంచిన ఆయన ఏం చేసినా అందులో ఏదో విభిన్నమైనది ఉండేలా చూసుకుంటూంటారు. అందుకే ఆయన సినిమాలు హిట్, ప్లాపులకు అతీతంగా ముందుకెళ్తూంటాయి. అదే కోవలో ఆయన ‘ఉత్తమ విలన్‌' టైటిల్ తో ఓ చిత్రం రూపొందించారు. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు.

తెయ్యమ్‌ కళాకారుడిగా, సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ రెండు పాత్రల్లో నటించిన సినిమా ‘ఉత్తమ విలన్‌'. ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. లింగుస్వామి నిర్మిస్తున్నారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. రమేష్‌ అరవింద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది. నవంబర్‌ 7న కమల్‌హాసన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఉత్తమ విలన్‌'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను కేరళలో శ్రీ కాళి ఈశ్వరి ఫిల్మ్స్‌ విడుదల చేస్తోంది.

Kamal Haasan's Uthama Villain on his birthday

కమల్‌హాసన్‌ నటించిన ‘విశ్వరూపం-2' వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ‘పాపనాశనం' వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా మూడు సినిమాలకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండటంతో కమల్‌హాసన్‌ బిజీగా ఉన్నారు.

ఇక కమల్ తాజా చిత్రం 'పాపనాశం' విషయానికి వస్తే.... ఇందులో కమల్‌ భార్యగా గౌతమి నటిస్తున్నారు. మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన 'దృశ్యం' చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగులోనూ వెంకటేశ్‌ హీరోగా ఈ సినిమా పునర్నిర్మితమై ప్రేక్షకులను అలరించింది. అదే కథతో ఇప్పుడు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కమల్‌ 'పాపనాశం'గా సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర వాల్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి.

కమల్‌ మళ్లీ 1980 దశకంలో ఉన్నట్లు ఇందులో కనిపిస్తున్నారు. ఓ గ్రామీణ వ్యక్తిలా.. సినీ జనాలను ఆకట్టుకుంటున్నారు. 'మైఖెల్‌ మదన కామరాజ్‌' శైలిలో కమల్‌ కనిపిస్తున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి కథాపరంగా 'పాపనాశం' ఎంత ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే అంటున్నారు. బిజినెస్ వర్గాల్లో సైతం ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అన్ని చోట్లా ప్రూవైన కథ కావటంతో సినిమా ఘన విజయం సాధించటం ఖాయమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X