డిలేట్ చేసిన కమల్ 'ఉత్తమ విలన్‌'టీజర్ (వీడియో)

By Srikanya

చెన్నై: కమల్‌హాసన్‌ నుంచి రాబోతున్న చిత్రం 'ఉత్తమ విలన్‌'. పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన కమల్‌ ట్రైలర్‌తో దాన్ని మరింత పెంచారు. దీని ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఓ అవార్డు పంక్షన్ లో విడుదలైన ఈ ట్రైలర్ ఆన్ లైన్ లోనూ లాంచ్ చేసారు. అయితే కాస్సేపటికి కారణమేంటో తెలియదు కానీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అప్పటికే కొందరు దాన్ని డౌన్ లోడ్ చేసుకుని యూ ట్యూబ్ లో పెట్టేసారు. ఇప్పుడు మీరు చూడబోయే ట్రైలర్ అదే.

'మృత్యుంజయ.. విలన్‌' అంటూ సాగే నేపథ్య సంగీతంతో చిత్ర ప్రధాన పాత్రధారుల చిత్రాలు ఒకటికొకటిగా మారుతున్నట్లు ట్రైలర్‌ను రూపొందించారు. బాలచరదర్‌పై చిత్రదర్శకుడు రమేష్‌ అరవింద్‌ క్లాప్‌నివ్వడంతో మొదలయ్యే ఈ ట్రైలర్‌ చివరకు కమల్‌ ప్రజలకు అభివాదం చేస్తున్నట్లు ముగుస్తుంది. చిత్రంలో బాలచందర్‌, కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజ కుమార్‌, వూర్వశి తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్‌.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/QxdySheocOA" frameborder="0" allowfullscreen></iframe></center>

దర్శకుడు రమేష్ అరవింద్ మాట్లాడుతూ.. '' నేను, కమల్‌ మంచి స్నేహితులు. కన్నడలో నేను తెరకెక్కించిన 'రామా శ్యామా భామా'లో కమల్‌ ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన 'విశ్వరూపం 2' చిత్రీకరణ పూర్తి చేశారు. నేను కూడా కన్నడ సినిమాలను ఒప్పుకోలేదు. కమల్‌తో 'ఉత్తమ విల్లన్‌' తెరకెక్కించే పనుల్లో ఉన్నా. దీని స్క్రిప్ట్‌ను కమలే రాశారు. పలు సినిమాలలో ఆయనతో కలసి నటించిన అనుభవం ఉంది. మా అభిప్రాయాలను బాహాటంగా చర్చించుకుంటాం. మంచి స్నేహితుడు కావడంవల్ల అడ్వాంటేజ్‌ తీసుకోగలుగుతున్నాను''అని చెప్పారు. 'పంచతంత్రం'లో కమల్‌తోపాటు ఓ ముఖ్య పాత్ర పోషించారు ఈ చిత్రం దర్శకుడు రమేష్‌.

Kamal Haasan's Uttama Villain teaser

'ఉత్తమ విలన్‌' చిత్రంలో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం కాగా, కమల్‌తో కలిసి దక్షిణాదికే చెందిన మరో నలుగురు అగ్ర హీరోలు కూడా ఇందులో కనిపించనున్నారని సమాచారం. వారిలో ఒకరిగా మమ్ముటిని ఎంపిక చేశారు. ఇది పూర్తి హాస్యభరిత కథా చిత్రమని సమాచారం. ఈ తరహా చిత్రాలకు సంభాషణలు రాయడంలో రచయిత క్రేజి మోహన్ పేరు గడించారు. ఉత్తమ విలన్ చిత్రానికీ ఆయనే మాటలు రాస్తున్నారు. హాస్యపాత్రలో వివేక్ నటించనున్నారు. ప్రస్తుతం కమలహాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాతే ఉత్తమ విలన్ తెరకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X