విశ్వరూపం2లో జెరోనిమో.. లాడెన్ ఎన్కౌంటర్ సీన్, ముందుగానే ఊహించాడట!

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. విశ్వరూపం మొదటి భాగం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరిన్ని యాక్షన్ సన్నివేశాలతో విశ్వరూపం 2 చిత్రం రాబోతోంది. టెర్రరిజం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కోసం యాక్షన్ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ విశ్వరూపం 2 చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 ముందే ఊహించా

ముందే ఊహించా

కమల్ హాసన్ విశ్వరూపం పూర్తి కథని 2010 లోనే సిద్ధం చేశారట. లాడెన్ త్వరలో మరణించడం ఖాయం అని కూడా కమల్ హాసన్ అప్పుడే ఊహించాడట. ఆ మరుసటి ఏడాదే 2011 లో తాను ఊహించన విధంగానే అమెరికా లాడెన్ ని మట్టుబెట్టింది కమల్ తెలిపారు.

ఒబామా

ఒబామా

లాడెన్ హతం అయినట్లు విశ్వరూపం చిత్రంలో ఒబామా ప్రకటించే వీడియోల్ని చూపించిన సంగతి తెలిసిందే. లాడెన్ ఎన్కౌంటర్ సన్నివేశాలు విశ్వరూపం 2 లో ఉన్నాయా అనే ప్రశ్నకు కమల్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రత్యేకంగా ఉండవని, కథలో భాగంగా చూపిస్తామని తెలిపాడు.

జెరోనిమో

జెరోనిమో

లాడెన్ ని అంతమొదించడానికి జెరోనిమో అనే సీక్రెట్ ఆపరేషన్ ని అమెరికా ప్లాన్ చేసింది. జీరోనిమో అనే సీక్రెట్ ఆపరేషన్ పేరుతోనే లాడెన్ ని ఫినిష్ చేశారు. ఆ పదాన్ని తాను అనుకోకుండా స్క్రిప్ట్ లో వాడానని కమల్ తెలిపారు.

ఆ సమయంలోనే

ఆ సమయంలోనే

విశ్వరూపం మొదటి భాగం షూటింగ్ కోసం 2011 లో అమెరికాలో దరఖాస్తు చేసుకున్నాం. ఆ ఏడాది మే లో షూటింగ్ చేయాలని భావించాం. కానీ అమెరికా అప్పుడు అనుమతి ఇవ్వలేదు. ఆ తరువాతే అద్భుతం జరిగింది. మే 2 న అమెరికా లాడెన్ ని మట్టుబెట్టిందని కమల్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X