హాలీవుడ్‌ ప్రముఖలకు కమల్ 'విశ్వరూపం'

By Srikanya

చెన్నై : డీటీహెచ్‌ విధానంతో వార్తల్లో నిలిచిన చిత్రం 'విశ్వరూపం'. కమల్‌హాసన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 25న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 2న డీటీహెచ్‌లో ప్రదర్శితమవనుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌ నటుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఈ విషయమై కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ''విశ్వరూపం ప్రత్యేక ప్రదర్శన అమెరికాలో ఏర్పాటు చేశాం. 24న లాస్‌ఏంజెల్స్‌లో జరగనుంది. ఇందుకోసం నేను, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అక్కడికి వెళ్తున్నాం. హాలీవుడ్‌ ప్రముఖులకు 'విశ్వరూపం' చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. డీటీహెచ్‌లో విడుదల చేయడం కూడా అంతే సంతోషంగా ఉంది. ఒక సొత్తును దొంగలు దోచుకుపోతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. సొత్తు యజమాని కొంత భాగం తీసుకుంటున్నా సమస్యలు పుట్టిస్తున్నారు. పైరసీ దొంగలను పక్కనబెట్టి డీటీహెచ్‌లో విడుదల చేస్తున్న నన్ను అడ్డుకోవడం సబబు కాదు'' అన్నారు.

'విశ్వరూపం' చిత్రాన్ని నిషేధించాలని తమిళనాడు ముస్లిమ్‌ మున్రేట్ర కళగం డిమాండ్‌ చేసింది. ఈ విషయమై శాసనసభ సభ్యుడు జవహరుల్లా నేతృత్వంలో ఆ పార్టీ నేతలు నగర పోలీసు కమిషనర్‌ జార్జ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మత సామరస్యానికి ఇలాంటివి విఘాతం కలిగిస్తాయని, నిషేధించాలని కోరారు.

మరో ప్రక్క 'విశ్వరూపం' చిత్రాన్ని 'నేరుగా ఇంటికి ప్రసారం'(డీటీహెచ్‌)విధానంలో విడుదలజేసే విషయమై... కమల్‌హాసన్‌, థియేటర్‌ యజమానుల మధ్య సమసిపోయిందనుకుంటున్న వివాదం ఇంకా పొగలు చిమ్ముతూనే ఉంది. తమిళనాడు థియేటర్‌ యజమానుల సంఘంపై కమల్‌హాసన్‌ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఢిల్లీలోని పోటీనియంత్రణ సంఘం(పో.ని.స.) దర్యాప్తుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ సంస్థ త్వరలోనే తమ దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌కు లాంఛనంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X