‘వచ్చే పుట్టిన రోజు సీఎంగా.. నా బర్త్ డే వేడుకలు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే.. ’

విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడు, బిగ్‌బాస్ హోస్్ కమల్ హాసన్ తమిళ సినీ, రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. నవంబర్ 7వ తేదీన 66వ జన్మదినాన్ని జరుపుకొన్న సంగతి తెలిసిందే. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పుట్టిన రోజు ఎక్కడ జరుపుకొంటామనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఆయన వచ్చే ఏడాది బర్త్ డేను ఎక్కడ జరుకుంటానని చెప్పారంటే..

ప్రజా సంక్షేమ దినంగా నా బర్త్ డే

ప్రజా సంక్షేమ దినంగా నా బర్త్ డే

తన పుట్టిన రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి, సోదరీమణులకు థ్యాంక్స్. దేశవ్యాప్తంగా నా సినీ, రాజకీయ మిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు శుభాకాంక్షలు తెలిపారు. మీడియాలోని కొందరు మిత్రులు నాకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. వారి శుభాకాంక్షలు నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. నా పుట్టిన రోజును ప్రజా సంక్షేమ దినంగా పాటించాలని అనుకొంటున్నాను ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

మీ ప్రేమకు నా కళ్లు చెమర్చాయి

మీ ప్రేమకు నా కళ్లు చెమర్చాయి

అలాగే మక్కల్ నీది మైయం పార్టికి చెందిన సోదరుల, సోదరీ మణులు జన్మదినం చెప్పిన తీరుకు, నాపై ప్రేమను కురిపించిన విధానంతో నా కళ్లు చెమర్చాయి. నా సేవలు ఇక పూర్తి స్థాయిలో పార్టీకి ఉపయోగిస్తాను. సమాజం కోసం మంచి పనిని చేయాలని నిర్ణయించుకొన్నాను అని కమల్ హాసన్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఒట్టేస్తున్నా.. నా నెక్ట్స్ బర్త్ డే సీఎంవోలోనే..

ఒట్టేస్తున్నా.. నా నెక్ట్స్ బర్త్ డే సీఎంవోలోనే..

ఇక నన్ను అభిమానించే వ్యక్తులకు, నా ఫ్యాన్స్‌కు, అలాగే సన్నిహితులు, స్నేహితులకు ఓ మాట ఇస్తున్నాను. వచ్చే ఏడాది నా పుట్టిన రోజు సీఎంగా.. అది కూడా ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరుపుకొంటాననే విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను అని తన ట్వీట్‌లో తెలిపారు. ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ అంటే తమిళనాడులో ముఖ్యమంత్రి కార్యాలయం. ఆ సీఎంవోను ఫోర్ట్ సెయింట్ జార్జ్‌‌గా పిలుస్తారు.

వచ్చే ఏడాది ఎన్నికల కోసం సర్వం సిద్ధం

వచ్చే ఏడాది ఎన్నికల కోసం సర్వం సిద్ధం

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మక్కల్ నీది మైయం పార్టీని సర్వసన్నద్ధం చేస్తున్నారు. 2021 మే నెలలో జరుగున్నాయనే విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించి తమిళనాడుకు తదుపరి ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం పదవిని అధిష్టించి జన్మదినాన్ని తమిళనాడు సీఎంవోలో జరుపుకొంటాననే ధీమాను ట్వీట్‌లో వ్యక్తం చేశారు.

232 చిత్రం టీజర్ రిలీజ్

232 చిత్రం టీజర్ రిలీజ్

ఇక తన పట్టిన రోజును పురస్కరించుకొని తన అభిమానులుకు కమల్ హాసన్ చిరు బహుమతిని అందించారు. తన కెరీర్‌లో 232 చిత్రంగా రానున్న మూవీకి సంబంధించిన టీజర్‌ను అందించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X