twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇకనైనా నిద్ర లేవాలి. ఇంకా కుర్చీని పట్టుకొని వేలాడకు.. కమల్ హాసన్ ఫైర్

    |

    కరోనావైరస్ ఓ వైపు విజృంభిస్తుంటే తమిళనాడు సీఎం ఈ పళనిస్వామి నిరో రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారని విలక్షణ నటుడు, మక్కల్ నీది మాయమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వచ్చంద సంస్థలు, ఇతర సేవా సంస్థలకు నేరుగా బాధితులకు ఆహరం, ఇతర నిత్యావసర వస్తువులు అందించవద్దని, ఏదైనా చేయాలంటే ప్రభుత్వం ద్వారా అందించాలని ఆదేశాలివ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలక విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని అనడంపై కమల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ.. దక్షిణాదిలో పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్జీవోలు, రిటైర్డు డాక్టర్ల నుంచి సహకారం తీసుకొంటే.. తమిళనాడు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సహాయ చర్యలకు అడ్డుతగిలే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసకోవడం దారుణం. గౌరనీయులైన మంత్రులకు కమిషన్లకే సమయం ఉంది గానీ ఇలాంటి సేవా కార్యక్రమాలకు టైమ్ లేదా అని ప్రశ్నించారు.

    Kamal Haasan serious on CM Edappadi Palanisamy!

    ఇక తమిళనాడు సీఎం పళనిస్వామిపై దాడికి దిగుతూ.. పక్క రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌పై స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే.. మన గౌరవనీయులైన సీఎం మల్లగుల్లాలు పడుతున్నారు. మన మాస్టర్ వాయిస్ మాత్రం వినిపించడం లేదు. ప్రజల తరఫున నా గొంతును వినిపిస్తున్నాను. ఇకనైనా నిద్ర నుంచి మేల్కొనండి. ఇంకా కుర్చీని పట్టుకొని వేలాడకు అని కమల్ ట్వీట్ చేశారు.

    English summary
    Kamal Haasan serious on CM Edappadi Palanisamy. He tweeted that While other state CMs take an autonomous call on lockdown, What are you waiting for, my Honourable CM? Your Master's voice? My voice is of the People and from them. Wake up sir while you sit, still in your chair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X