కమల్ హాసన్-శంకర్ ‘ఇండియన్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది
కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో మొదలైన 'ఇండియన్ 2' ప్రాజెక్ట్ విషయంలో రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రొడక్షన్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. దర్శకుడు శంకర్, కమల్ హాసన్ ఈ ప్రాజెక్టును ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సినిమా కాస్త లేటవుతున్న మాట నిజమే కానీ... ప్రాజెక్ట్ ఆగిపోలేదని చిత్ర బృందం స్పష్టం చేస్తోంది. 2021లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2021 తమిళ న్యూ ఇయర్ (మార్చి 14)న నాటికి దీన్ని విడుదల చేసేలా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మింస్తున్నారు. 1996లో వచ్చిన 'భారతీయుడు' మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అందులోని సేనాపతి పాత్రతో సీక్వెల్ కథ మొదలవుతుందని తెలుస్తోంది.
ఇందులో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ కోసం ఆమె కలరియపట్టు అనే యుద్ధవిద్యలో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. ఆమెతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, విద్యుత్ జామ్‌వాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ 'భారతీయుడు 2' మూవీ గురించి స్పందించారు. ఈ ఏడాది నవంబర్లో తాను షూటింగులో జాయిన్ అవుతానని, ఇందుకోసం కలరియపట్టు విధ్యలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











