బడ్జెట్ విని షాకయ్యా.. అందుకే మణిరత్నంతో చెయ్యలేదు.. ఆ సినిమాపై కమల్ హాట్ కామెంట్స్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏ ముహూర్తాన అనుకొని బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా స్టార్ట్ చేసారో కానీ అక్కడ నుంచి మరింతమంది చిత్ర దర్శకులకి రెండు భాగాలుగా సినిమాలు చేస్తే జనం చూస్తారు అనే ఉత్సుకతని మాత్రం జక్కన్న మిగిల్చారు.
కాగా జక్కన్న బాహుబలి కారణంగా వచ్చిన ఎన్నో భారీ చిత్రాల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన సినిమాలు పొన్నియిన్ సెల్వన్ కూడా ఒకటి. కాగా తమిళనాట రాజ్యమేలిన మహారాజులు రాజ రాజ చోళులు, రాష్ట్ర కూటులు ఇలా దక్షిణ భారతాన్ని ఏలిన కొందరు రాజుల మహా చరిత్రని మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించారు.

కాగా ఈ చిత్రాలని తాను రాజమౌళి ప్రేరణతోనే తీసాను అని బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయితే మణిరత్నం అంటే పలు ఐకానిక్ సినిమాలు తప్పక గుర్తుకొస్తాయి. మరి వాటిలో ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన చిత్రం నాయగన్ తెలుగులో నాయకుడు కూడా ఒకటి. అలాంటి ఎవర్ గ్రీన్ సినిమా తర్వాత మళ్ళీ సినిమా వీరు తీయలేదు కానీ మధ్యలో ఓ భారీ సినిమా నుంచి తాను తప్పుకున్నట్టుగా కమల్ హాసన్ తాజాగా తెలిపారు.
కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వనే అట. కాగా ఈ సినిమాలో కమల్ హీరోగా కాదు కానీ నిర్మాతగా మణిరత్నంతో చేయాల్సి ఉందట. మరి ఈ సినిమా అనుకున్నప్పుడే మణిరత్నం ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పేసరికి కమల్ షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆ బడ్జెట్ దెబ్బకి ఆ సినిమా నుంచి వెనక్కి వెళ్ళాను అని తెలిపారు.
కమల్ హీరోగానే కాకుండా ఎన్నో సినిమాలు నిర్మాతగా కూడా చేశారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ సినిమాలు చేశారు. కానీ పొన్నియిన్ సెల్వన్ రేంజ్ బడ్జెట్ సినిమాలు తన నుంచి ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ రెండు చిత్రాలకి కూడా మొత్తం 500 కోట్ల బడ్జెట్ అయ్యింది. దీనితో ఈ బడ్జెట్ తాను పెట్టలేనని కమల్ తప్పుకున్నట్టుగా తెలిపారు.
దీనితో తన ప్లేస్ లో లైకా నిర్మాణ సంస్థ వచ్చారు. వీరు చేసిన సినిమాలు ఫైనల్ గా 800 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నారు. ఇంట్రెస్టింగ్ గా పార్ట్ 2 కంటే పార్ట్ 1 పెద్ద హిట్ అవ్వడం విశేషం. సో అలా మొత్తానికి కమల్ హాసన్ మణిరత్నంతో సినిమా వదులుకోవాల్సి వచ్చిందట.
ఇక నిర్మాతగా మిస్ అయ్యినప్పటికీ వీరి కలయికలో మళ్ళీ 38 ఏళ్ళు తర్వాత థగ్ లైఫ్ అనే భారీ సినిమాతో రాబోతున్నారు. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా శింబు, త్రిష, దుల్కర్ సల్మాన్ ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకి మాత్రం కమల్ నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











