‘పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటున్నారా? అయితే నీ బతుకు గోవిందా!’

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవసరం లేదు. ఆయనకు దక్షిణాదిలో ఎంతటి ప్రత్యేకమైన స్టేటస్ ఉందో అందరికీ తెలిసిందే. తమిళ స్టార్ గా ఎదిగినా.. తెలుగు ఆడియెన్స్ లోనూ కమల్ హాసన్ కు విశేష ఆదరణ ఉంది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. 40 ఏళ్లకు పైగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ డైరెక్ట్స్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ కాంబోలో థియేటర్లలోకి వచ్చి కమల్ హాసన్ దుమ్ములేపిన సంగతి తెలిసిందే.

అయితే కమల్ హాసన్ సోషల్ గాను ఎంతో అవేర్ నేస్ తో ఉంటారు. ఆయన ఏదైనా అంశం పైన మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడుతుంటారు. సినీ వేదికలైన మరే ఇతర సందర్భాల్లో నైనా ఎంతో నేర్పుగా మాట్లాడుతుంటారు. అయితే ఎప్పటినుంచో కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టాలని ప్రయత్నించారు. ఇక కొన్నాళ్ల కింద MNM పార్టీని కూడా స్థాపించారు. అప్పటినుంచి తన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు అర్థం అయ్యేలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కాంట్రవర్సీలను తెరలేపే వ్యాఖ్యలు చేస్తున్నారు.

Kamal Haasan Shocking Comments on Arranged Marriages Where is Tamil Star Opinion

కాగా తాజాగా కమల్ హాసన్ అరేంజ్ మ్యారేజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దలు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి కుదిరిచ్చే వివాహాన్ని తక్కువ చేసి మాట్లాడారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే జీవితాంతం అన్నిట్లో అరేంజ్ లు చేసుకోవడమే సరిపోతుందన్నారు. అరేంజ్ మ్యారేజ్ ల వల్ల ఏది అంత సరిగా ఉండదని అభిప్రాయపడ్డారు. అరేంజ్ మ్యారేజ్ వల్ల ఇతరులు మన లైఫ్ ను లీడ్ చేసే అవకాశం ఉందన్నారు. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తారో వారినే పెళ్లి చేసుకోవడం మంచిదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

వీలైతే ఒక వ్యక్తిని ఇష్టపడి, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకొని పెళ్లి చేసుకుంటే మంచిదని సూచించారు. అయితే తన అభిప్రాయాన్ని చెప్పడంలో అరేంజ్ మ్యారేజ్ విధానాన్ని తప్పు పట్టడం ఏ మాత్రం సరి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు కమలహాసన్ విమర్శిస్తుంటే... మరికొందరు ఈ కాలానికి తగినట్టుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారని అంటున్నారు. ఏదేమైనా కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.

Kamal Haasan Shocking Comments on Arranged Marriages Where is Tamil Star Opinion

Take a Poll

మరోవైపు సౌత్ ఇండియాలో కమల్ హాసన్ కి నటుడిగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా కమలహాసన్ పొలిటికల్ పార్టీ ద్వారా కూడా అంతే మైలేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగానే తమిళ చిత్రపరిశ్రమలోను యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అంతేకాకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొడుతున్నారు. చివరిగా కమల్ హాసన్ ' విక్రమ్ 2', ' ఇండియన్ 2' చిత్రాల్లో నటించారు. నెక్స్ట్ తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్'లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X