కమల్ హాసన్ పాట పాడుతున్నాడు
చెన్నై: హీరోలు అంతా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. అదే రూటులో కమల్ హాసన్ సైతం పాట పాడటానికి సిద్దమవుతున్నారు. అయితే ఆయన పాడే పాట ఆయన నటిస్తున్న చిత్రం కోసం కాదు. వీజే ప్రొడక్షన్స్ బ్యానరుపై నూతన దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'అవం' కోసం కావటం విశేషం.
ఈ చిత్రానికి చంద్రమూర్తి సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో హీరో ఒంటరితనం, ఆవేదనను చాటే ఓ గీతాన్ని ఆలపించే వారికోసం చిత్ర యూనిట్ వెతికింది. ఎంతో మందిని పరిశీలించాక.. 'విశ్వనటుడు' కమల్‌హాసన్ న్యాయం చేయలగలరని భావించింది.

ప్రముఖ గేయ రచయిత వైరముత్తు కుమారుడు మదన్‌కార్కి రాసిన ఆ పాటను పాడమని కమల్‌ను ఇటీవల దర్శకుడు కోరారు. చిత్ర ప్రాధాన్యతను గుర్తించిన ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఇందులో గౌరవ్ హీరోగా నటించారు. కావ్యాశెట్టి కథానాయిక. 'రాజా రాణి' ఫేం గుహన్ ఎస్.పళని సినిమాటోగ్రఫీ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ''కమల్ పాడితేనే ఆ గీతం బాగుంటుందని అనుకున్నాం. మా కోరికను మన్నించి ఆయన పాడారు. చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పాట అందర్నీ హత్తుకునేలా ఉంటుంది''అని చెప్పారు.


Click it and Unblock the Notifications











