Vikram సక్సెస్ తో కమల్ హాసన్ జోష్.. దర్శకుడికి ఖరీదైన లగ్జరీ కారు.. ధర ఎంతంటే?
ఇటీవల కాలంలో ఒక సినిమా సక్సెస్ అయితే దర్శకులకు నిర్మాతలకు నుంచి అలాగే స్టార్ హీరోల నుంచి కూడా ప్రత్యేకంగా కానుకలు అందుతున్నాయి. ఇక ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారి అయితే ఏకంగా కోట్ల విలువైన కార్లను కూడా ఇస్తున్నారు. రీసెంట్గా విశ్వనటుడు కమల్ హాసన్ కూడా చాలా రోజుల తర్వాత విక్రమ్ సినిమాతో సక్సెస్ కావడంతో ఆ సినిమా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు ప్రత్యేకమైన కానుక ఇచ్చాడు. ఇక ఆ లగ్జరీ కారు ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే.

వరుస అపజయాలు
చాలా కాలంగా కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అప్పుడెపుడో విశ్వరూపం ఫస్ట్ పార్ట్ తర్వాత మళ్లీ ఆయనకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందలేదు. ఏళ్ల తరబడి ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా అపజయాలను చూశాడు.

మౌత్ టాక్ ద్వారానే..
ఇక ఫైనల్ గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన విక్రమ్ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ అలాగే సూర్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా నెగిటివ్ రివ్యూలో వచ్చినప్పటికీ కూడా ఆడియన్స్ సపోర్ట్ తో అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. కేవలం మౌత్ టాక్ ద్వారానే సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ ఏర్పడింది.

తెలుగులో కూడా మంచి కలెక్షన్స్
తెలుగులో కూడా కమల్ హాసన్ కు చాలా రోజుల తర్వాత సక్సెస్ అందింది అనే చెప్పాలి. ఈ సినిమాను తెలుగులో నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట మూవీస్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేసేందుకు ఈ సినిమా హక్కులను దాదాపు 9 కోట్ల వరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక దాదాపు ఆ పెట్టుబడిని విక్రమ్ సినిమా ఫస్ట్ వీక్ ఎండ్ లోనే రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది.

ఆనందంలో కమల్ హాసన్
మొత్తానికి ఈ సినిమా సక్సెస్ తో నటుడు కమల్ హాసన్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. చాలాకాలం తర్వాత సక్సెస్ రావడంతో దర్శకుడికి ప్రత్యేకమైన కానుక కూడా ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటీవల కాలంలో దర్శకులకు నిర్మాతల నుంచి ఎక్కువగా ఇలాంటి బహుమతులు అందుకున్నాయి.

ఆ కారు ధర ఎంతంటే?
కమల్ హాసన్ ఖరీదైన లైక్సస్ కారును లోకేష్ కనగరాజ్ కు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఆ కారు విలువ మార్కెట్ ప్రకారం 60 లక్షలకు పైగానే ఉంది. సినిమా కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు భారీ స్థాయిలో పారితోషికం అందుకున్న లోకేష్ ఇప్పుడు సినిమా సక్సెస్ అనంతరం మరొక ఖరీదైన బహుమతిని అందుకోవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.


Click it and Unblock the Notifications











