కమల్ హాసన్ కానుకకు మురిసిపోయిన హీరో సూర్య.. దాని ఖరీదు ఎంతంటే?
విక్రమ్ సినిమా సక్సెస్ కావడంతో కమలహాసన్ అయితే ఆనందంలో మునిగిపోతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజులుగా ఆయన బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేదు. ఇక మొత్తానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాతో ఆయన స్థాయికి తగ్గట్టుగా పవర్ఫుల్ సక్సెస్ ని చూశారు. ఇక చాలా కాలం తర్వాత వచ్చిన ఈ విజయాన్ని ఆయన చాలా ఆనందం గా సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వారికి కూడా ప్రత్యేకమైన కానుకలు ఇస్తున్నారు. ఇప్పటికే దర్శకుడికి ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన కమల్ హాసన్ ఇప్పుడు హీరో సూర్యకు కూడా ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

వరుసగా అపజయాలు రావడంతో..
విశ్వనటుడు కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమా తో సరైన సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో తన మార్కెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక కమల్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయడం రిస్క్ అనే స్థాయికి కూడా ఆయన వచ్చారు. ముఖ్యంగా ఇండియన్ 2 సినిమా ఆగిపోవడం కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి.

విక్రమ్ తో హిట్టు
అయితే కమల్ హాసన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సరైన కథ పడితే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించవచ్చు అని ఈసారి విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమా మంచి లాభాలు అందుతున్నాయి.

తెలుగులో కూడా..
ముఖ్యంగా తెలుగులో అయితే కమల్ హాసన్ సినిమా పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి తీసుకు వచ్చింది. విక్రమ్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ పై విడుదల చేశారు. ఇక మొదటి వారాంతంలోనే ఈ సినిమా పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకు వచ్చేసింది. సోమవారం నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు అందిస్తోంది. అంతేకాకుండా థియేటర్ల సంఖ్య ను కూడా పెంచడం జరిగింది.

దర్శకుడికి ఖరీదైన కారు
అయితే కమల్ హాసన్ ఈ సినిమా సాధించిన విజయంతో చాలా హ్యాపీగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదివరకే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు సంతోషంలో ఒక మంచి కానుక కూడా ఇచ్చారు. లగ్జరీ కార్ లెక్సస్ ను బహుమతిగా ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యి. దాదాపు 60 లక్షల విలువ చేసే ఆ కారు బహుమానంగా రావడంతో లోకేష్ కనగరాజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
Recommended Video


సూర్య కోసం రోలెక్స్
ఇక రీసెంట్ గా నటుడు సూర్య కోసం కూడా కమల్ హాసన్ ప్రత్యేకంగా ఒక కానుకగా ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో సూర్య రోలెక్స్ అనే పాత్రలో చివరలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక సూర్య కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారని కమల్ హాసన్ ప్రత్యేకంగా అతనికి 47 లక్షల విలువచేసే రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా సూర్య కమల్ హాసన్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











