70 ఏళ్ల వయసులో లిప్‌లాక్‌తో రెచ్చిపోయి .. త్రిషతో కమల్ రొమాన్స్‌పై ట్రోలింగ్
ఇటీవలి కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా ఏది తీసుకున్నా రొమాన్స్, లిప్‌లాక్‌లు వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఒకే వయసు నటీనటుల మధ్య కథకు అనుగుణంగా ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉండేవి. అయితే ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య వయసుతో సంబంధం లేకుండా ఈ తరహా సన్నివేశాలు పెట్టడంతో దర్శక నిర్మాతలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్
భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో కమల్ హాసన్ ఒకరు. దాదాపు 60 ఏళ్లకు పైగా వెండితెరపై ఆయన చెరగని ముద్రవేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా ఆయన సేలందిస్తున్నారు. 1960లో బాలనటుడిగా మహానటి సావిత్రికి కుమారుడిగా నటించి తొలి చిత్రంతోనే రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నారు కమల్ హాసన్. 1974లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ప్రయోగాలకు పెద్ద పీట వేశారు. భారతీయ సినిమా చరిత్రలో కమల్ మాదిరిగా ప్రయోగాలు చేసిన నటుడు మరొకరు కనిపించరు.

లిప్‌లాక్ సీన్స్‌లో కమల్ సిద్ధహస్తుడు
గతేడాది కల్కి 2898 ఏడీలో సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్ నటన హైలైట్‌గా నిలిచింది. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మించి నటిస్తున్నారు కమల్. ప్రస్తుతం థగ్ లైఫ్, ఇండియన్ 3 సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటనతో పాటు రొమాన్స్. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్స్‌తో ఆడిపాడిన ఆయన లిప్‌లాక్ సన్నివేశాల్లో ఎక్స్‌పర్ట్. ఎంతో మంది ముద్దుగుమ్మలతో కమల్ హాసన్ లిప్‌లాక్ సీన్స్ చేశారు.
తన కంటే 30 ఏళ్లు చిన్నదైన నటితో లిప్‌లాక్
తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ థగ్‌లైఫ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో కమల్ హాసన్, మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్‌లు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ థగ్ లైఫ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
కమల్ హాసన్‌పై నెటిజన్ల ట్రోలింగ్
ఈ ట్రైలర్‌లో కమల్ హాసన్, అభిరామి మధ్య ఘాటైన లిప్‌లాక్ సీన్ ఉంటుంది. అలాగే త్రిషతోనూ రొమాన్స్ ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తున్నప్పటికీ 70 ఏళ్ల వయసులో కూతురు వయసున్నీ హీరోయిన్లతో ఇలాంటి సీన్స్ అవసరమా అంటూ నెటిజన్లు కమల్ హాసన్‌పై మండిపడుతున్నారు. ఇప్పుడే కాదు గతంలో పోతురాజు అనే సినిమాలోనూ అభిరామితో కమల్ లిప్‌లాక్, ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. వయసు, అనుభవం, ఇమేజ్ దృష్ట్యా కమల్ హాసన్ ఇలాంటి సన్నివేశాలు తిరస్కరించాలంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై కమల్ హాసన్, థగ్ లైఫ్ యూనిట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











